అమ్మఒడి కొందరికే పరిమితం కాదు… అర్హులైన అందరికీ: జగన్

– బడికి పంపే ప్రతీ పేద తల్లికి ఈ పథకం వర్తిస్తుంది.

అమ్మఒడి పథకం అందరికీ బదులుగా అర్హులైన ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేదలకే ఇవ్వడం మంచిదా? ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే వాళ్లకే ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు పలువురు మంత్రులు వ్యాఖ్యలు ద్వారా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఎక్కడ చదువుతున్నారనే దానితో సంబంధం లేకుండా ప్రతీ విద్యార్థికీ ఏటా రూ. 15 వేలు సాయం చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకే జగన్ కట్టుబడినట్లు సీఎంవో ఒక ప్రకటన విడుదలచేసింది.

ఈ మేరకు ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలలో చదివే పేద విద్యార్థుల తల్లికి ఈ పథకం కింద డబ్బు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. నిరుపేదలైన ఎందరో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలో నిరుపేదలే అధికం.

అయితే పేదల్లో కూడా కొందరు కష్టపడి పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పథకం అంటే అనేకమంది నష్టపోతారని, చదివించేందుకు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం జగన్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

About The Author