సిద్ధిపేట జిల్లా టి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన…
సిద్ధిపేట జిల్లా టి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు మాట్లాడుతూ. 2001లో TRS స్థాపించిన నాడు పార్టీ కార్యాలయంలో ఎక్కడ పెట్టికోవాలన్నా వీలు లేని పరిస్థితి. జలదృశ్యంలో పార్టీ కార్యాలయం పెట్టు కుంటే నాటి పాలకులు బలవంతంగా తొలగించారు. ఈ రోజు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాదించుకోవడం, రాజధానిలో అద్భుతమైన పార్టీ కార్యాలయం నిర్మించికున్నాం.. ఇప్పుడు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటున్నాం. ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని ఈ రోజు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకుంటున్నాం. జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇదొక వేదికగా ఉంటుంది. ఎకరం స్థలంలో పక్క వాస్తు ప్రకారం దసరా నాటికి భవనాన్ని నిర్మించుకొని ప్రారంభించుకుంటాం. బిల్డింగ్ నిర్మాణానికి త్వరలోనే ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తాం. వారి ఆధ్వర్యంలో వేగంగా అద్భుతమైన భవనం నిర్మించుకుందాం. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏకకాలంలో 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేసుకుంటున్నాం. జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ గారు మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో TRS పార్టీ భవనాలకు శంకుస్థాపన చేసుకుంటున్నాం. బంగారు తెలంగాణ నిర్మాణంలో తొలి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా అవకాశం లభించింది. అందరి సహకారంతో నా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తా. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా.. రాష్ట్రంలోనే జిల్లా అన్ని రంగాల్లో ముందు ఉండేలా అందరి సహకారంతో పని చేస్తా.