‘జనసేన’కు జై కొట్టిన వంగవీటి…


‘జనసేన’కు జై కొట్టిన వంగవీటి: ఏపీలోని రాజకీయ పార్టీల్లో వలసలు వేగవంతమవుతున్నాయి. టీడీపీ దారుణ ఓటమితో.. ఆ పార్టీలో ఉన్న నేతలు మరో పార్టీ కండువాను కప్పుకుంటున్నారు. ఈ క్రమంలో కాపునాడు నేత వంగవీటి రాధా జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన ఆయన.. నేడో రేపో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. విజయవాడలో తన కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. తన రాజకీయ భవిష్యత్‌పై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన వంగవీటి.. ఆ పార్టీలో తనకు సముచిత స్థానం లభించగలదని ఆశించారు. కానీ చంద్రబాబు ఆయనకు మొండిచేయి చూపడంతో తన ఆశలను వదులుకున్న రాధా.. చివరికి జనసేన పట్ల మొగ్గుచూపారు.

About The Author