ఆపరేషన్ ‘బాలాకోట్’ వ్యూహకర్తకు… ‘రా’ పగ్గాలు…

భద్రతా విభాగాలలో కీలక శాఖలకు అధిపతులను నియమిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు.

విదేశాలకు సంబంధించిన నిఘా వ్యవహారాలను పర్యవేక్షించే అత్యంత కీలక విభాగమైన ‘రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్ వింగ్‌’ (#రా)కి #సామంత్‌‌గోయెల్‌ని ఛీప్‌గా నియమించారు.

అలాగే #ఇంటెలిజెన్స్_బ్యూరో(#ఐబీ)కి #అరవింద్‌‌కుమార్‌ ని డైరెక్టర్‌గా నియమించారు.

ఈ ఇద్దరూ 1984 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారులు, గోయెల్‌ పంజాబ్‌ కేడర్‌కు చెందినవారు కాగా.. అరవింద్‌ కుమార్‌ అసొం-మేఘాలయ కేడర్‌ కు చెందినవారు.

ఇప్పటివరకు నిఘా వర్గాల ఆపరేషన్స్‌ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించిన సామంత్‌ గోయెల్‌, గత ఫిబ్రవరిలో బాలాకోట్‌పై వైమానిక దాడులు, 2016 మెరుపు దాడుల వ్యూహ రచనలో కీలకంగా వ్యవహరించారు. 1990లో పంజాబ్‌లో చెలరేగిన తీవ్రవాదాన్ని సమర్ధవంతంగా ఉక్కు పాదంతో అణచివేసిన వ్యక్తిగానే కాక, పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలపైనా మంచి అవగాహన కలిగిన అధికారి గా అద్భుత ట్రాక్ రికార్డ్ సామంత్ గోయల్ కు ఉంది.

ఐబీ చీఫ్‌గా ఎన్నికైన అరవింద్‌ కుమార్‌ వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం ఈయన ఐబీ కశ్మీర్‌ విభాగంలో ప్రత్యేక డైరెక్టర్ గా, లోయలో ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమంలో ప్రముఖంగా వ్యవహరిస్తున్నారు.

#బాలాకోట్ #సామంత్‌గోయల్ #అరవింద్‌కుమార్ #రా #ఐబీ #ప్రదానమంత్రి #నరేంద్రమోడి #మెరుపుదాడులు

About The Author