అమెరికాలోనూ మన కుంతీమ తల్లులు..
కుంతీమ తల్లులు భారత దేశంలోనే కాదు, అమెరికాలో కూడా ఉన్నారు. మన దేశానికి చెందిన ఓ మహిళ బిడ్డను కని ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టి అడవుల్లో వదిలేసింది. అమెరికాలోని జార్జియాలో జరిగిన ఈ సంఘటనపై అక్కడి పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తూ తల్లి ఎవరో కనుగొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓ పోలీస్ అధికారి తన విధి నిర్వహణలో పోతుండగా పసిబిడ్డ ఏడుపు విని పొదల్లోకి వెళ్లి చూశారు. ఈనెల 6వతేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. ప్లాస్టికి బ్యాగ్ లో చుట్టిన ఆడ బిడ్డ వారికి కనిపించింది. భారత దేశానికి చెందిన వస్తువుల్ని తీసుకొని వచ్చిన బ్యాగ్ అది. దీంతో పొదల్లో దొరికిన ఆ పురిటి శిశువుని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి బిడ్డను కనిపారేసిన తల్లికోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. తల్లిని వెదికే సంగతి ఎలా ఉన్నా బిడ్డను తమకు దత్తత ఇవ్వాలంటూ వేలమంది పోలీసులకు దరఖాస్తు చేసుకోవడం కొసమెరుపు