కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ…
https://www.youtube.com/watch?v=mQdBmsFBU24
తన జీవితం ప్రజా సేవకే అంకితమని ,నిత్యం ప్రజలతోనే ఉంటానని తన రాజకీయ భవిష్యత్తు ముఖ్య మంత్రి కే సి ఆర్ నిర్ణయిస్తారని కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ తెలిపారు. కరీంనగర్ జిల్లా జడ్పి కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ జడ్పి చైర్మన్ గా తన పదవి కాలం ముగియనున్నందున ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి కార్యకర్తగా పని చేసానని అనేక ఉద్యామాలలో పాలు పంచుకున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లా పరిషత్ కు తొలి మహిళ చైర్ పర్సన్ గా అవకాశం లబించడం తనకు ఎంతో సంతృప్తి నిచ్చిందని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్న కొద్ది పాటి నిధులతో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు.50 కోట్ల జడ్పి నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేసినట్లు అనేక సాంఘీక సంక్షేమ కార్యక్రామాలు చేసింట్లు వివరించారు. 5 సంవత్సరాల కాలంలో అందుబాటులో ఉన్న నిధులతో కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ అభివృద్ధి పథకంలోనిలిపినట్లు తెలిపారు.తన హయం లో కరీంనగర్ జిల్లా పరిషత్ కు జాతీయ స్థాయి అవార్డు రావడం సంతోషకరం అని అన్నారు. జిల్లా పరిషత్ అద్వర్యం లో భతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించినట్లు అలాగే ప్రతి సంవత్సరం ౩౦ వేల మట్టి వినాయకుడి విగ్రహాలను ఉచితంగా పంపిణి చేసినట్లుఇవే కాకుండా ఇంకా అనేక ప్రజలకు ఉపయోగ పడే కార్యక్రామాలు అనేకం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. అంతకు ముందు భారత మాజీ ప్రధాని, ఉమ్మడి కరీంనగర్ ముద్దు బిడ్డ,ఆర్ధిక నిపుణుడు పి. వి. నరసింహ రావు జయంతి ని పురస్కరించుకొని జడ్పి హాల్ లో ఉన్న పివి నిలువెత్తు చిత్రపటానికి జడ్పి చైర్ పర్సన్ తుల ఉమ ఇతర సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. జడ్పిటిసి సభ్యులు తన్నీరు శరత్ రావు , వీరల కవిత ,మంజుల ఇతరులు పాల్గొన్నారు.