నిమ్మాడ బి.సి హాస్టల్ లో రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఆకస్మిక తనిఖీ…
కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ బి.సి హాస్టల్ ను తనిఖీ చేసిన రాష్ట్ర రోడ్డు,భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణ దాస్.
శుక్రవారం రాత్రి హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి, వసతిగృహ ఆవరణంతా కలియతిరిగి, సౌకర్యాల కల్పనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట గదిలోకి వెళ్లిన మంత్రి విద్యార్థులకు వండిపెడుతున్న అన్నం, కూరలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని విద్యార్థులను ఆరా తీశారు. మరుగుదొడ్లను పరిశీలించడంతోపాటు నీటి సరఫరా, కరెంటు, గదులలో ఫ్యాన్ సౌకర్యాల ఏర్పాట్లను చూసిన మంత్రి వసతుల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రి వెళ్ళిన సమయానికి 98 మంది విద్యార్థులకు గాను 78 మంది ఉన్నారు.వార్డెన్,కుక్,వాచమన్ ,లేరు .కేవలం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఉన్నారు. ఆగ్రహం వ్యక్తంచేసిన మంత్రి ,చర్యలకి సిఫార్సు చేస్తామని తెలిపారు.
మంత్రి తనిఖీకి వెళ్ళే సమయానికి, ధనుంజయ్ అనే విద్యార్థి తీవ్ర కడుపునొప్పి, జ్వరంతో బాధ పడుతున్నాడు.. ఆ విద్యార్థిని పట్టించుకునేవారు ఎవరూ లేకపోవడంతో స్వయంగా మంత్రి డాక్టర్ కు ఫోన్ చేసి విద్యార్థికి వైద్య సౌకర్యాలను కల్పించారు.