ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం…
ఆ లక్ష్మీ దేవి చల్లగా చూస్తేనే మనకు భోగభాగ్యాలు, ఆస్తులు అంతస్తులు దక్కేది.
అందుకోసమే ఆమెను మొక్కులు, పూజలు చేస్తుంటాం.
అయితే లక్ష్మీదేవిని తిధి ప్రకారం పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఆ తిధిని బట్టి చేయాల్సిన పద్దతులు కూడా ఉంటాయి.
అవేంటో చూద్దాం.
పాడ్యమి..
ఈ రోజున లక్ష్మీ దేవికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి.
విదియ..
ఈ రోజున చక్కెరతో అమ్మవారికి అభిషేకం చేయాలి.
తదియ..
ఈ రోజున కూడా ఆవుపాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది
చవితి..
పిండివంటల నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు సంప్రాప్తిస్తాయి.
పంచమి..
అరటిపళ్ళు నైవేద్యం నివేదించడం వలన మేథస్సు, బుద్ధిశక్తి దిగ్వినీకృతం అవుతుంది (పెరుగుతుంది).
షష్ఠి..
తేనెతో అభిషేకించి చేసినట్లయితే,
బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన కాంతి పెరుగుతుంది,
యశస్సు పెరుగుతుంది.
అష్టమి..
బెల్లం నీళ్ళతో అభిషేకించి,
శుద్ధి బెల్లం ఎవరికయినా దానం ఇవ్వడం వలన అష్టకష్టాలు తీరిపోయి సుఖంగా ఉంటారు.
నవమి..
పేలాలు నైవేద్యం నివేదించినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
దశమి..
నల్లనువ్వులతో చేసిన నైవేద్యాన్ని పెట్టినట్టయితే దీర్ఘాయుష్షు లభిస్తుంది.
ఏకాదశి..
చెరకు పానకం..నివేదన చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది.
ద్వాదశి..
పాలతో చేసినవి నివేదన చేస్తే సుఖవంతమైన జీవితం.
త్రయోదశి..
తేనే తో అభిషేకం చేస్తే ఆరోగ్యం.
చతుర్దశి..
కొబ్బరి నీటితో అభిషేకం చేసి పేలాలు నైవేద్యంగా పెడితే సుఖసంతోషాలతో ఉంటారు.
పౌర్ణమి..
తేనె..పాలతో అభిషేకం.. నివేదన చేస్తే లక్ష్మీ కటాక్షం.
అమావాస్య..
పర్వాన్నము నివేదన చేస్తే ఐశ్వర్యం.
ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది.
అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.
తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది.
పాడ్యమి :
అధిదేవత – అగ్ని.
వ్రత ఫలం – సత్ఫల ప్రాప్తి.
విదియ :
అధిదేవత – అశ్విని దేవతలు.
వ్రత ఫలం – ఆరోగ్య వృద్ది.
తదియ :
అధిదేవత – గౌరీ దేవి.
వ్రత ఫలం – సుమంగళీ అనుగ్రహం.
చవితి:
అధిదేవత – వినాయకుడు.
వ్రత ఫలం – కష్టములు తొలగిపోవుట.
పంచమి:
అధిదేవత – నాగ దేవత.
వ్రత ఫలం – వివాహము, వంశ వృద్ది.
షష్టి :
అధిదేవత – సుబ్రహ్మణ్య స్వామి.
వ్రత ఫలం – పుత్ర ప్రాప్తి.
సప్తమి:
అధిదేవత – సూర్య భగవానుడు.
వ్రత ఫలం – ఆయురారోగ్య వృద్ది.
అష్టమి:
అధిదేవత – అష్టమాత్రుకలు.
వ్రత ఫలం – దుర్గతి నాశనము.
నవమి:
అధిదేవత – దుర్గాదేవి.
వ్రత ఫలం – సంపద ప్రాప్తిస్తుంది.
దశమి:
అధిదేవత – ఇంద్రాది దశ దిక్పాలకులు.
వ్రత ఫలం – పాపాలు నశిస్తాయి.
ఏకాదశి:
అధిదేవత – కుబేరుడు.
వ్రత ఫలం – ఐశ్వర్యము ప్రాప్తించును.
ద్వాదశి:
అధిదేవత – విష్ణువు.
వ్రత ఫలం – పుణ్య ఫల ప్రాప్తించును.
త్రయోదశి:
అధిదేవత – ధర్ముడు.
వ్రత ఫలం – మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.
చతుర్దశి:
అధిదేవత – రుద్ర.
వ్రత ఫలం – మృత్యుంజయము, శుభప్రదం.
అమావాస్య:
అధిదేవతలు – పితృదేవతలు.
వ్రత ఫలం – సంతాన సౌఖ్యం.
పౌర్ణమి:
అధిదేవత – చంద్రుడు.
వ్రత ఫలం – ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.
(సేకరణ)