బెంగాల్ ప్రభుత్వానికి అమిత్ షా హెచ్చరిక…
పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి, పరోక్షంగా సీఎం మమతాబెనర్జీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరికలు జారీ చేశారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్, ముర్షిదాబాద్ జిల్లాల్లోని మదరసాలు జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయని కేంద్ర ఇంటలిజెన్స్ అందించిన నివేదికతో అమిత్ షా పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పశ్చిమబెంగాల్ లోని రెండు మదరసాల్లో ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్ సాగుతుందని, జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ సంస్థను ఉగ్రవాద సంస్థగా కేంద్రం ఇప్పటికే ప్రకటించిందని దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్కారును అమిత్ షా ఆదేశించారు.
బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పశ్చిమబెంగాల్ ప్రాంతంలో జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుందని, ఈ సంస్థ ఉగ్రవాదులు పాక్ కేంద్రంగా నడుస్తున్న లష్కరే తోయిబాకు మద్ధతు ఇస్తుందని ఇంటలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి.
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో వైరం నేపథ్యంలో అమిత్ షా తాజాగా పార్లమెంటు సాక్షిగా ఆ రాష్ట్రప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.