తెలుగులోనూ సుప్రీంకోర్టు తీర్పులు


సుప్రీంకోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనూ చదువుకోవచ్చు. తీర్పు కాపీలు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేసిన సూచన ఈ నెలాఖరు నుంచి అమల్లోకి రానుంది. ప్రాంతీయ భాషల్లోనూ తీర్పులు అనువాదం చేయడానికి వీలుగా సాఫ్ట్‌వేర్‌ను సుప్రీంకోర్టు అభివృద్ధి చేస్తోందని ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి కూడా తెలిపారు. ఆంగ్లంలో తీర్పులు అదే రోజున వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ప్రాంతీయ భాషల్లో అనువదించినవి వెబ్‌సైట్‌లో ఉంచడానికి వారం రోజులు పట్టనుంది. తెలుగుతోపాటు అస్సామీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా భాషల్లోకి తీర్పులు అనువదిస్తారు.

About The Author