మదర్ తెరెసా అబద్దాలు బయటపెట్టిన అరూప్ చటర్జీ…
1. ఒక సందర్భంలో మదర్ తెరెసా గారు, కోల్కతాలో ఉన్న శిశుభవన్ లో రోజుకు 1000 మందికి భోజనం పెడతాం అని చెప్పారు. అరూప్ చటర్జీ గారు తరువాత కొన్ని రోజుల పాటు, అదే శిశుభవన్ దగ్గర కెమెరా పట్టుకొని గడిపారు. అక్కడ భోజనం పెట్టేది కేవలం 70 మందికి (ఉదయం 50, సాయంత్రం 20)
2. నోబెల్ బహుమతి తీసుకున్న కొంత కాలం తరువాత మదర్ తెరెసా గారు తన జీవిత చరిత్ర రాస్తున్న కేత్రిన్ స్పింక్ గారికి “మేము కోల్కతాలో మాత్రమే రోజుకు 7000 మందికి భోజనం పెడతాం, మేము కనక భోజనం పెట్టకపోతే వాళ్ళు ఆ రోజుకు పస్తు ఉండాల్సిందే” అని చెప్పారు. కానీ ఆ సమయానికి మిషనరీస్ అఫ్ చారిటీస్ కేవలం రోజుకు 500 మందికి మాత్రమె వంట చేసేవారు. అది కూడా అక్కడ పని చేసే నన్లు, సిస్టర్లని కలుపుకొని
3. మరో సందర్భంలో, తాము కోల్కతలోని మోతిజ్ హీల్ ప్రాంతంలో 5000 పిల్లలతో పాఠశాల నడుపుతున్నాం అని చెప్పారు. కానీ నిజానికి అక్కడ 100 మంది కూడా లేరు.
ఆధారం: మదర్ తెరెసా: ఏన్ అన్టోల్డ్ స్టొరీ – రచయిత: అరూప్ చటర్జీ – పేజి నెంబర్: 282 నుండి 340 (కిన్డిల్) గమనిక: మదర్ తెరెసా గారి మీద “ది హెల్ల్స్ ఏంజెల్” డాక్యుమెంటరీ అనే డాక్యుమెంటరీ వచ్చిన విషయం చాలా మందికి తెలిసి ఉండవచ్చు. దానికి క్రిస్టోఫర్ హిచిన్స్ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ డాక్యుమెంటరీకి ఆధారం అరూప్ చటర్జీ గారి పరిశోధనలే
ఆధారం ఇచ్చింది కేవలం, ఇందులో నిజం ఎంత అని తెలుసుకుదాం అనుకునే వారి గురించి. ఎవరినైనా గుడ్డిగా నమ్మకూడదు కద?
అయితే ఇది కొందరికి నచ్చదు. నచ్చదు కాబట్టి నమ్మరు. వారికి నాదో సలహా. మదర్ తెరెసా పేరు తెసేసి మాతా ఆనందమయి అనో ఇంకోటో పెట్టుకొని చదవండి. ఆశ్చర్యంగా మీకు ఇవన్నీ పచ్చి నిజాలు అనిపించేస్తాయి. ఏ ఆధారం అడగాలి అని కూడా అనిపించదు. మనసు ఆనంద డోకలలో మునిగి తేలుతుంది. ఇంకా ఆనదం కలగాలి అంటే సంస్థ పేరుని ఆర్.ఎస్.ఎస్ గా ఊహించుకోండి. ఇక చూడండి, మీ ఆనందానికి హద్దులే ఉండవు.
రెండో మార్గం కూడా ఉంది. ఇదంతా ఆర్.ఎస్.ఎస్./భాజపా కుట్ర అనేసుకోండి, సరిపోద్ది.
సేకరణ :- వడియాల రంజిత్ గారు