కోపంతో మంత్రి ఇంట్లోకి పీతలను వదిలి నిరసన…
మంత్రి ఇంట్లోకి పీతలను వదిలారు..
ఇదికదా బుద్ది చెప్పే నిరసన అంటే..
మహారాష్ట్రలోని తివరె ఆనకట్టకు గండి పడి 20 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై స్పందించిన మహారాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి తానాజీ సావంత్.. ఇందుకు కారణం పీతలే అంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నివాసంలోకి కొందరు నిరసన కారులు పీతలను వదిలారు. ఆనకట్ట చుట్టూ పెద్ద సంఖ్యలో పీతలు ఉన్నాయని, ఈ కారణంగానే గండిపడిందని ఆయన వ్యాఖ్యానించారు..
సావంత్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కార్యకర్తలు నిరసన తెలిపారు. మంత్రి నివాసానికి వెళ్లి తమతో తెచ్చుకున్న పీతలను ఆ ఇంటి గుమ్మం ముందు వదిలారు. పదుల సంఖ్యలో పీతలు ఆ ఇంట్లోకి, ఇంటి చుట్టుపక్కలకు పరుగులు తీశాయి. ‘‘ఇందులో మా తప్పు ఏముంది? మేము నేరస్థులము కాము’’ అని పీతలు అంటున్నట్లుగా కార్యకర్తలు బ్యానర్లను ప్రదర్శించారు