నూతన వధూవరులకు వాటర్ బాటిళ్ళే గిఫ్ట్…”Video”
https://www.youtube.com/watch?v=kNg5-I91cAU
చెన్నైలో నీటి కొరతకు ఇదో నిదర్శనం…
చెన్నైలో నీటి కొరత ఎంత దారుణంగా వుందో… చుక్క నీరు కోసం తమిళవాసులు అలమటించిపోతున్నారు. నీటి ట్యాంకర్ కోసం గంటల కొద్దీ సమయం వేచి చూస్తున్నారు. ఒక్క బిందె నీటి కోసం 50 రూపాయలు ముట్టజెప్పుకునే దుస్థితి దాపురించింది. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో శుభకార్యాలు తలపెట్టుకుంటే పరిస్థితి ఇంకెలా వుంటుందో ఊహించుకోండి. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ వుంది. ఓ పెళ్ళి శుభకార్యానికి వచ్చిన బంధుమిత్రులు నీటి కొరతను దృష్టిలో వుంచుకుని వాటర్ బాటిళ్ళను నూతన వధూవరులకు బహుమతిగా అందించారు. సాధారణంగా ఇలాంటి శుభకార్యాల్లో బంగారం, వెండి, గృహోపకరాలు ఇతరత్రా సామాగ్రిని వధూవరులకు అందించడం జరుగుతుంటుంది. అయితే చెన్నైలో నీటి దుస్థితి ఎంత దారుణంగా వుందో ముందే ఊహించి కొత్త దంపతులకు వాటర్ బాటిళ్ళను అందిచడం విశేషం See Less