కన్న కూతురినే కాటేశాడు…


మానవ సంబంధానికి మచ్చతెచ్చేలా నీచపు పనికి పాల్పడ్డాడో కామాంధుడు. తాగిన మైకంలో 12ఏళ్ల కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాబుట్టాయగూడెంలోని అరుంధతిపేటలో జరిగింది.

అరుంధతిపేటలోని ఓ వ్యక్తి భార్య, 12ఏళ్ల కూతురితో కలిసి ఉంటున్నాడు. నిత్యం తాగొచ్చి భార్యను వేధిస్తుండటంతో ఆమె తరుచూ పుట్టింటికి వెళ్లిపోయేది. ఒక్కోసారి కూతురిని భర్త వద్దే వదిలేసి తాను మాత్రమే పుట్టింటికి వెళ్లి ఒకట్రెండు రోజుల తర్వాత తిరిగొచ్చేది. ఈ నేపథ్యంలో కన్న కూతురిపైనే కన్నేసి ఆ కామాంధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు.

బాలిక ఇటీవల తరుచూ అనారోగ్యానికి గురవుతుండటంతో తల్లి శనివారం బుట్టాయగూడెంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. బాలిక పరిస్థితిపై అనుమానం వచ్చిన డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించగా గర్భవతి అని తేల్చారు. ఈ విషయం తెలిసి షాకైన బాలిక తల్లి భర్తపైనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డీఎస్పీ రవికుమార్, సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది అరుంధతిపేటకు వెళ్లి విచారణ చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, డాక్టరల్ నివేదిక తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

About The Author