30 ఏళ్ళ క్రితం చేసిన అప్పుకోసం… ఖండాలు దాటి వచ్చాడు.. అప్పు తీర్చాడు…
అప్పు ఇస్తే అప్పులిచ్చిన డబ్బులకోసం కొట్లాటకో , కోర్టుకు పోవలసిన దుస్థితి .. అప్పు ఇచ్చి శత్రుత్వాలు కొనితెచ్చుకునే కాలమిది..ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో 30 ఏళ్ళ క్రితం చేసిన అప్పు తీర్చడం కోసం ఓ వ్యక్తి ఏకంగా కెన్యా నుంచి ఇండియా రావడం నిజంగా గ్రేటే. ఆ వచ్చిన వ్యక్తి అక్కడ ఎంపీ కావడం ఇక్కడ విశేషం. . 79 ఏళ్ల కాశీనాథ్ గావ్లీ ఇంటికి రెండు రోజుల క్రితం ఓ అనుకోని అతిథి వచ్చాడు. తన పేరు రిచర్డ్ టోంగ్ అని.. కెన్యా దేశ ఎంపీనని చెప్పాడు. 30 ఏళ్ల క్రితం కాశీనాథ్ తనకు రూ. 200 సాయం చేశాడని.. ఆ సొమ్మును తిరిగి చెల్లించడానికి వచ్చానన్నాడు. ఆశ్చర్యపోవడం కాశీనాథ్ వంతయ్యింది.
‘1985-89 కాలంలో నేను మేనేజ్‌మెంట్ కోర్సు చడవడం కోసం ఇండియా వచ్చాను. అప్పుడు నేను మహారాష్ట్ర లోని వాంఖేడ్‌నగర్ ప్రాంతంలో ఉండేవాడిని. కాశీనాథ్ గారి కుటుంబం కూడా అదే ప్రాంతంలో కిరాణ షాపు నడుపుతుండేవారు. ఆ సమయంలో ఓ సారి డబ్బులు లేక నేను ఇబ్బంది పడుతుంటే కాశీనాథ్ గారు నాకు రూ. 200 సాయం చేశారు. అప్పుడు ఆ అప్పును తిరిగి చెల్లించే పరిస్థితిలో నేను లేను. కానీ ఆయన సాయాన్ని మాత్రం మర్చిపోలేకపోయాను. ఎప్పటికైనా కాశీనాథ్ గారి రుణాన్ని తీర్చుకోవాలని.. ఆయనకు కృతజ్ఞత తెలపాలని మనసులోనే అనుకునే వాడిని. ఇప్పటికి నాకు కుదిరింది’ అన్నారు రిచర్డ్. ఎగవేతకోసమే అప్పుతీసుకునే నేటికాలంలో ఈ సంఘటన నిజంగా సంచలనమే..
రిచర్డ్. తిరిగి వెళ్లేటప్పుడు కాశీనాథ్‌ను తమ దేశం రావాల్సిందిగా ఆహ్వానించారు రిచర్డ్. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది.