రూ.9 లక్షలు డిమాండ్ చేసి 4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో…


రూ.9 లక్షలు డిమాండ్ చేసి 4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

విఆర్వో లంచం డిమాండ్ వెనుక కేశంపేట్ MRO లావణ్య హస్తం

కేశంపేట మండలం నుండి ఇటీవల బదిలీపై కొందూర్గు మండల కేంద్రానికి వచ్చిన వీఆర్వో.

కొందూర్గులో పని చేస్తూ.. కేశంపేట మండల భూమి డీలింగ్..

MRO, లావణ్య, విఆర్వో అంతయ్య ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తహసీల్దార్ కార్యాలయంలో కొందుర్గు విఆర్ ఓ అంతయ్య నాలుగు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా చిక్కాడు. షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలానికి చెందిన దత్తాయ పల్లి గ్రామానికి చెందిన రైతు భాస్కర్ భూమి 12 ఎకరాలు ఉండగా 9 ఎకరాల 17 గుంటల భూమిని ఆన్లైన్ ఆన్ లైన్ లో రికార్డు మాయం చేశారు ఈ భూమి వ్యవహారంలో రికార్డుల్లో బాధితుని పేరు నమోదు చేయడానికి 9 లక్షల రూపాయలను డిమాండ్ చేశాడని తెలిసింది. అయితే డబ్బుల కోసం బాధితులను బాగా పీడించడంతో వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులకు మొరపెట్టుకున్నారు. 9 లక్షల రూపాయలను డిమాండ్ చేసిన నేపథ్యంలో నాలుగు లక్షల రూపాయలు ముందుగా చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు బాధితుడు. ఈరోజు విఆర్ఓ అంతయ్యను పథకం ప్రకారం బాధితులు అతనికి డబ్బులు ఇచ్చి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించారు. ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ, సిబ్బంది పట్టుకున్నారు. అయితే విఆర్ఓ అంతయ్య కేశంపేట మండలం నుండి ఇటీవల బదిలీపై కొందూర్గు మండల కేంద్రానికి వచ్చాడు. అయినప్పటికీ కూడా సదరు భూమి వ్యవహారంలో ఆజమాయిషి చలాయిస్తూ డబ్బులు ఇచ్చేవరకు పని జరగదు అని ఆదేశాలు జారీ చేయడంతో తప్పని పరిస్థితుల్లో బాధితుడు డబ్బులు చెల్లించుకోవాల్సి వచ్చిందని తెలుస్తుంది. అయితే ఈ భూమి రికార్డుల వ్యవహారంలో అంతయ్య వెనక ఉండి కేశంపేట్ MRO లావణ్య ఒత్తిడి చేయిస్తున్నారు.

*ఎసిబి డిఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ* ఒక్కరోజులో అన్ లైన్ లో మాయమైన రికార్డ్ అవినీతికి పాల్పడిన కేశంపేట్ తహసిల్దార్ లావణ్య అన్నారు. వి ఆర్వో అంతయ్య ద్వారా కేశంపేట్ MRO లావణ్య ఎకరానికి 1లక్ష రూపాయల చొప్పున 9 లక్షలు డిమాండు చేసి మొదటగా 4 లక్షల రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నాం అన్నారు. MRO లావణ్య , విఆర్వో అంతయ్య ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గురువారం కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. షాద్ నగ

About The Author