వన్డేలకు కెప్టెన్‌గా రోహిత్‌ ?

ప్రపంచకప్ నుంచి సెమీస్‌లో భారత్ నిష్క్రమించిన తర్వాత జట్టులోని లోపాలపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. నాలుగో స్థానంలో బ్యాట్స్‌మన్, రాయుడు రిటైర్మెంట్, మయాంక్ అగర్వాల్ జట్టులో ఎంపికపై అభిమానులు, మాజీ క్రికెటర్లు స్పందిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఫర్వాలేదనిపించినా వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అదరగొట్టాడు. టోర్నీలోనే అత్యధిక పరుగుల వీరుల్లో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే భారత సారథి బాధ్యతలను టెస్టుల్లో, వన్డేల్లో విభజించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు ఓ మీడియా సంస్థతో పేర్కొన్నాడు.*

రోహిత్‌ శర్మకు వన్డేల్లో సారథిగా బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయం. జట్టు యాజమాన్యానికి కోహ్లీ కెప్టెన్స్‌పై అపారమైన నమ్మకం ఉంది. కానీ వచ్చే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకోని ప్రణాళికలు రచించుకోవాలి. 2015 ప్రపంచకప్‌లో విఫలమైన ఇంగ్లాండ్‌ తర్వాత లోపాలను సరిచేసుకుని విశ్వవిజేతగా నిలిచింది. భారత్ కూడా అదే తరహా పద్ధతిని పాటించాలి. మనం జట్టుని అన్ని విభాగాల్లో సమతూకంగా మార్చుకోవాలి. సారథిగా రోహిత్‌ చక్కగా సరిపోతాడు.’ అని అన్నాడు.*
*పాలక కమిటీ (సీవోఏ) ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌ నేతృత్వంలో జరిగే సమీక్ష తర్వాత కీలక నిర్ణయాలు వెలువడతాయని తెలిపాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి, సెలక్షన్‌ బృందంతో భవిష్యత్‌ ప్రణాళికపై రాయ్‌ సమీక్ష నిర్వహించనున్నాడు. విండీస్‌ పర్యటనలో భాగంగా ఆగస్టులో టీ20, వన్డే, టెస్టు సిరీస్‌ల్లో భారత్‌ తలపడనుంది.*

About The Author