ప్రతి గ్రామంలో రెండు వైసీపీ గ్రూపులు…


రాష్ట్రంలోని అన్ని పంచాయితీ గ్రామాల్లో ఇదే పరిస్థితి.
మేము మాత్రమే కష్టపడ్డాం.మాకు మాత్రమే గుర్తింపు కావాలి,అలాగే పార్టీ(ప్రభుత్వం) నుండి ఏ సహాయం లేదా పధకం వచ్చినా ముందు మాకే కావాలి,మేము తీసుకున్న తర్వాత ఏదైనా మిగిలితే అప్పుడు మీరు తీసుకోండి అని అధిపత్యానికి కొట్టుకులాడుతున్న గ్రూప్ ఒకవైపు..

మీరు కష్టపడుతుంటే మేమేమైనా ఇంట్లో కూర్చున్నామా ఏందీ?నిజం చెప్పాలంటే మీకంటే మేమే ఎక్కువ కష్టపడ్డాం,మీరు పెద్ద నాయకుల భజన చేసుకుంటూ వాళ్ళ ఏసీ కారులో ఓసీ గా కూర్చుని తిరుగుతున్న టైం లో మేము ఎర్రటి ఎండలో ఇంటింటికీ తిరిగి నవరత్నాలని ప్రచారం చేశాం.
మా పేరు చెప్పుకుని పార్టీ నాయకుల దగ్గరనుండి డబ్బులు దొబ్బేసి తాగుతూ ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే మా జేబులో డబ్బులు తీసి ఛార్జీలకి,కటౌట్లకి ఖర్చుపెట్టాం.
మీరు పార్టీ పెద్దలకు భజనలు చేసి గల్లీ నాయకులుగా ఫీల్ అవుతున్నారు,మేము కష్టపడినా కార్యకర్తలుగానే మిగిలిపోయి ఉన్నాం.కాబట్టి మూసుకుని కూర్చోండి.పార్టీకి,ప్రభుత్వానికి అందరూ సమానమే.ఏ పధకమైనా అందరికీ సమానంగానే రావాలి అనే నిస్వార్థ గ్రూపు ఒకవైపు…

అయితే మొదటగా చెప్పిన గ్రూప్ కక్కుర్తికి కారణం గత 9 ఏళ్ల పాలన.పార్టీ,కులం,మతం,జన్మభూమి కమిటీల పేరుతో ఒక్కటంటే ఒక్క పధకం రాకుండా చేసిన గత పాలన నుండి ఇంకా తేరుకోలేదు వాళ్ళు.ఇప్పుడు కూడా అలాగే కొంతమందికే ప్రభుత్వ ఫలాలు అందుతాయేమో అన్న భ్రమ,భయంలో కక్కుర్తి పడుతూ కనీసం మన వరకూ బాగుపడితే చాల్లే,మిగిలినవాళ్ళ సంగతి మనకెందుకులే అనుకుంటున్నారు..

పాపం ఆ కక్కుర్తి భ్రమ జీవులకు చెప్పండి.వచ్చింది జగనన్న ప్రభుత్వం..పార్టీ,కుల,మత,ప్రాంత,బేధాలు లేకుండా అందరికీ అర్హతని బట్టి అన్ని పథకాలు అందుతాయని,అవసరమైతే నాలుగు పీకి బుద్ధి వచ్చేలా చెప్పండి నష్టం లేదు,వాళ్ళు మారకపోతేనే పంచాయితీ ఎన్నికల్లో తీవ్ర నష్టం..

ఓకేపార్టీలో గ్రూపు గొడవల్ని చూస్తున్న తటస్తులు,ఇతరపార్టీల వాళ్ళు మనల్ని అవహేళన చేస్తున్నారు.పార్టీ వచ్చి 2 నెలలు కూడా కావట్లేదు అప్పుడే కొట్టుకుంటున్నారు వీళ్ళు,జగన్ అనే ఒకే వ్యక్తి కష్టాన్ని,ఆలోచనని నమ్మి సంస్థాఘతంగా నిర్మాణం జరగని పార్టీకి ఓటు వేస్తే ఇలాగే ఉంటదని అవమానిస్తున్నారు.

దయచేసి మేలుకోండి నాయకుల్లారా.ఒక్కసారి గ్రామాల్లో జన్మభూమి కమిటీల పతనం ఎలా జరిగిందో గుర్తుతెచ్చుకోండి.ఇలాగే గ్రూపులుగా విడిపోయి ఇళ్ళు,లోన్లు కోసం కొట్టుకుని పార్టీని నాశనం చేశారు.ఇదే ఇప్పుడు వైసీపీ లో కూడా జరగబోతుంది.మీకు భజనలు చేసేవాళ్ళని కాసేపు పక్కనపెట్టి నిజమైన కార్యకర్తలకు భరోసా ఇవ్వండి.లేదంటే పంచాయితీ ఎన్నికల నుండే పార్టీ పతనం ప్రారంభం అవుద్ది.

About The Author