తిరుమలలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవం….

తిరుమలలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవం….
పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీకవనభోజన మహోత్సవం ఆదివారంనాడు తిరుమల పార్వేట మండపంలో అత్యంత వైభవంగా జరిగింది.

హ్

ప్రతి ఏడాదీ పవిత్ర కార్తీకమాసంలో భగవంతుని సమక్షంలో భక్తులు సహపంక్తి భోజనం చేయడం విశేషమ‌న్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించినట్టు తెలిపారు..
కాగా, ఉదయం 8.00 గంటలకు శ్రీ మలయప్పస్వామివారిని చిన్న గజవాహనంపై ఉభయనాంచారులను పల్లకీపై ఆశీనులను చేసి ఊరేగింపుగా పార్వేటిమండపానికి తీసుకొచ్చారు. స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం పార్వేట మండపంలో మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం వైభవంగా జరిగింది. వైదిక సనాతన సంప్రదాయంలో కార్తీకమాసంలో ఉసిరిక వనంలో కార్తీక వనభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగా టిటిడి పార్వేట మండపంలోని ఉసిరిక వనంలో ఆదివారంనాడు కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.

About The Author