అర్బన్ SP అన్బురాజన్ గారి ఆదేశాలు మేరకు

తమిళనాడులోకి ఉగ్రవాదులు చొరబాటు కారణంగా చిత్తూరు జిల్లాకు సరిహద్దులో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం ఐన శ్రీకాళహస్తిశ్వర దేవస్థానం నందు రెడ్ అలెర్ట్,భాగంగా  విసృత స్థాయిలో తనిఖీలను నిర్వహించి సెక్యూరిటీ సిబ్బందికి తగిన భద్రత సూచనలు ఇచ్చిన అర్బన్ CI నాగార్జున్ రెడ్డి గారు.

ఈసంధర్బంగా ఆయన మాట్లాడుతూ…!

అర్బన్ SP అన్బురాజన్ గారి ఆదేశాలు మేరకు హై అలర్ట్ సంధర్బంగా దేవస్థానం నందు తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు.ప్రముఖపుణ్య క్షేత్రాలలో ఒకటైన శ్రీకాళహస్తిశ్వర దేవస్థానానికి దేశం నలుమూలల నుండి భక్తులు అనేక మంది వస్తుంటారని వారి భద్రతదృష్ట్యా దేవాలయంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ సంబందిత  సెల్ ఫోన్ ,ట్యాబ్ వంటి వస్తువులను లోపలకి అనుమతించకుండా మరియు భద్ర పరిచిన సెల్ ఫోన్ కౌంటర్ లను, లగేజి కౌంటర్ లను కూడా క్షుణ్ణంగా తనఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. సెక్యూరిటి సిబ్బందికి కూడా తగిన సలహాలు ,సూచనలు ఇచ్చి వారి అప్రమత్తం చేయడం జరిగిందన్నారు.అదే విధంగా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై వాహనాలను కూడా ఆపి వాహాన సంబందిత కాగితాలు,డ్రైవర్ లైసన్సులు,ఆధార్ కార్డులను కూడా పరిక్షించి తనీఖీల అనంతరం వాహానాలను వదలడం జరిగిందని తెలిపారు.ఈవాహన తనిఖీలల్లో స్థానిక DSP నాగేంద్రుడు గారు కూడా పాల్గొన్నారు.

About The Author