మహిళల షటిల్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్.. PV Sindhu
మొదటిసారి కష్టం మీద ఫైనల్స్ లోకి చేరుకోవడం.. ఓటమి. రెండో సారీ ఫైనల్స్ లో గెలవాలనే తీవ్రమైన వత్తిడి. అప్పుడూ ఓటమి.. నిరాశ చెందకుండా మూడోసారి ఫైనల్స్ కి చేరి ఈసారి మహిళల షటిల్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ మొదటిసారి భారతదేశంకు సాధించిన ఆంధ్ర తేజం, తెలుగుబిడ్డ పివి సింధు .. అమ్మా నీకు అభినందనలు. ఒలింపిక్స్ లో వెండి పతకం గెలుపు తరువాత మధ్యలో విజయాలు రాలేదని కొందరు చేసిన విమర్శలు నీ పట్టుదలని తగ్గించలేదు. అదే స్పూర్తి ముందు కూడా కొనసాగించు. ఎప్పుడూ మీవెనుకే అండా దండాగా నిలబడిఉన్న నీ తల్లిదండ్రులు, కోచ్ గోపీచంద్ గారికి కూడా నమస్కారాలు.
#pvsindhu
#shuttlechampion
#పివిసింధు