వ్యవసాయ భూమి కలిగిన ప్రతీ రైతు… కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్

వ్యవసాయ భూమి కలిగిన ప్రతీ రైతు… కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ …పొందడానికి అర్హుడే

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు.

విత్తనాలు, పురుగుమందులు, ఎరు వులు, సాగు ఖర్చులు వంటి వ్యవసాయ అవసరాల కోసం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇస్తారు. రోజువారీ వ్యవ సాయ సంబంధిత ఖర్చులకూ వినియోగించుకోవచ్చు. వ్యవసాయ భూమి కలిగిన ప్రతీ రైతు కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ పొందడానికి అర్హుడే. కొన్ని పరిమితుల మేరకు కౌలు రైతులకు ఇస్తారు. భూమి ఉన్న రైతు తన పట్టాదారు పాసు పుస్తకాన్ని తీసుకెళ్లి సాధారణ డాక్యుమెంటేషన్‌ ద్వారా బ్యాంకులో పొందవచ్చు.

రైతుకు బీమా కవరేజీ కూడా ఉంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు తీసుకున్న రైతులకు కేంద్రం రూపే కార్డులు ఇస్తుంది. వాటిని సాధారణ క్రెడిట్‌ కార్డు మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కోసం ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డును రాష్ట్రంలో అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు అందిస్తున్నాయి.

About The Author