లక్షల వీడియోలు తొలగిస్తున్న యూట్యూబ్.. అలాంటి వాటికి ఇక బ్రేక్..!


హైదరాబాద్ : యూట్యూబ్ ఆంక్షలు మరింత కఠినతరం అవుతున్నాయి. లక్షల కొద్దీ వీడియోలు ప్రతి నిత్యం అప్‌లోడ్ అవుతున్న తరుణంలో యాజమాన్యం ఎప్పటికప్పుడూ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రతి మూడు నెలలకోసారి రివ్యూ చేస్తున్న యూట్యూబ్ నిర్వాహకులు పనికిమాలిన వీడియోలను డిలేట్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో యూట్యూబ్ ఛానళ్లను సైతం తొలగిస్తున్నారు.మరో వైపు చూస్తే యూట్యూబ్‌లో మంచి కన్నా చెడు ఎక్కువ కనిపిస్తోందనే వాదనలు లేకపోలేదు. ఆ క్రమంలో సెన్సార్ కటింగ్ లాగా యూట్యూబ్ నిర్వాహకులే చెత్తను తొలగించే పనిలో పడ్డారు. అలా ఈ ఏడాదిలో జూన్ నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఇప్పటికే దాదాపు లక్ష వరకు వీడియోలను తొలగించినట్లు ప్రకటన విడుదల చేశారు.
వీడియోలను డిలేట్ చేయడమే గాకుండా.. 40 లక్షలకు పైగా యూట్యూబ్ అకౌంట్లను తొలగించామని నిర్వాహకులు ప్రకటించారు. వాటిలో చాలా మటుకు వీడియోలు వీక్షకులను తప్పు దోవ పట్టించే విధంగా ఉన్నాయని వెల్లడించారు.

About The Author