శభాష్ ఇండియా…. శభాష్ ఇస్రో….


ఆఖరి నిమిషంలో చంద్రయాన్ విఫలం పై బాధపడాల్సిన అవసరం లేదు. అనితరసాధ్యమైన విషయాలను సాధించే క్రమంలో ఇలాంటివి సహాజమే. మీరు చేసిన ప్రయోగాల్లో ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ సంపూర్ణ విజయాలంటే ఆషామాషీ కాదు. అంతరిక్ష ప్రయోగ మంటేనే భారీగా ఖర్చు చేయాలన్న ప్రపంచ దృక్పధాన్ని మార్చిన వ్యక్తులు మీరు. ప్రపంచంలోనే అత్యంత చౌక అంతరీక్ష పరిశోదనలకి కేరాఫ్ అడ్రస్ గా భారత్ ను నిలిపిన భారత మాత ముద్దు బిడ్డలు మీరు. చంద్రుడిపై పరిశోదనలు చేసిన అగ్రదేశాలు కూడా కనుగొనలేని నీటి ఆనవాళ్లు కనుగొన్న తెలివైన వారు మీరు. ఒక్క పరీక్ష విఫలమైనంత మాత్రాన మిమ్మల్లి విమర్షించే స్దాయి మాకు లేదు… కానీ ఈ తాజా ప్రయోగం నుంచి పాఠాలు స్వీకరించి మీరు దూచుకుపొండి…మీ వెనక 130 కోట్ల మంది భారతీయులున్నారు.

About The Author