అమరగాయకుడు ఘంటసాల గారికి జయంతి నివాళి…

అమరగాయకుడు ఘంటసాల గారికి జయంతి నివాళి

సంగీతం! ఒక గంధర్వ గానాన్ని తన మణి పూసల్లో ఒక పూస గా అమర్చుకుంది. పాటే పుణ్యం చేసుకుంది అమర గాయకుని స్వరంలో ఒదిగిపోయినందుకు. గాన గంధర్వుడు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఘంటసాల గారు. తెలుగు పాటల పల్లకిలో ఊరేగిన సంగీత చక్రవర్తి. ఏ మారుమూల ప్రాంతాల్లో కి వెళ్లినా వినిపించే మధుర గానం ఘంటసాల వారి గాత్రం. గాత్రంలోనే సంగీత ఝరి ప్రవహించే ఘంటసాలే కదా తెలుగు పాటకు స్వరపేటిక. కృష్ణమ్మ ఒడిలో పుట్టిన సంగీత ముత్యం. మాటే పాటగా మారిన ఆ రోజుల్లో విరిసిన గానామృతం ఘంటసాల స్వరం. చిన్ననాటి నుంచే పువ్వు పరిమళించినట్టుగా ఆయన అన్ని విద్యల్లో తండ్రి సహకారంతో రాణించే వారు. . ఇంతలేసి కళ్లు. తేనెలొలికే తీయని గొంతు……ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా ఇట్టే గ్రహించే గ్రాహకశక్తి, అణకువ, ఇవన్నీ దేవుడిచ్చిన వరాలు. తండ్రితో బాటు ఆడుతూ.. పాడుతూ… వుండే బాల ఘంటసాలకు పాటలే లోకంగా ఉండేవి.ఘంటసాల కనుమూసినా తెరచినా సంగీతం సంగీతం….
కఠోర సాధనే సాంత్వన.

భానుమతి ఘంటసాల ప్రతిభని గుర్తించి తన స్వీయనిర్మాణం ‘రత్నమాల’ చిత్రానికి సహాయ సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశం కల్పించారు. అదే స్వరరచనకి పునాది. ఆ తర్వాత ‘మనదేశం’, బాలరాజు సినిమాలకు స్వరరచన చేసే అవకాశం లభించింది. ‘బాలరాజు’ చిత్రం సంచలన విజయం సాధించింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్ట మొదటి రజతోత్సవ చిత్రం బాలరాజు!
సంగీతంలో ఎన్నో మైలు రాళ్ళని దాటుకుని రాబోయే తరం లో ఎంతమంది వచ్చినా ఆయన గానానికి చేరువగా రాలేని విధంగా ఆయన గానం ఇప్పటికీ నిలిచి పోయింది. ఎన్ని తరాలు మారినా మారని సంగీతం ఘంటసాల గారిదే. ఆయన్నోమారు స్మరించుకుంటూ మ్యూజిక్ వరల్డ్ అడ్మిన్స్

About The Author