షార్ నుంచి వదిలిన ఉపగ్రహం తీసిన ఫొటో ఇదీ…

షార్ నుంచి వదిలిన ఉపగ్రహం తీసిన ఫొటో ఇదీ…

భూ ఉపరితల పర్యవేక్షణ ఉపగ్రహం హైసిస్‌ తొలి అడుగును విజయవంతంగా వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గత నెల 29వ తేదీన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ కేంద్రం నుంచి పంపిన పీఎస్‌ఎల్‌వీ-సీ43 రాకెట్‌ ద్వారా హైసిస్‌ కక్ష్యలోకి చేరిన విషయం తెలిసిందే. ఈ ఉపగ్రహం ఆదివారం గుజరాత్‌లోని లఖ్‌పేట్‌ పరిసరాలను చిత్రీకరించి సోమవారం పంపింది. ఈ మేరకు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. ఈ ఉపగ్రహం పంపే చిత్రాలతో వ్యవసాయం, నేలసార పరీక్షలు, పర్యావరణ నియంత్రణకు సంబంధించి నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌కు ఎంతో ఉపయుక్తం కాగలదని వెల్లడించింది. హైసిస్‌ పంపిన ఈ చిత్రం ఎంతో స్పష్టంగా, ఉపయుక్తంగా ఉన్నట్లు ఇస్రో అభిప్రాయపడింది. దాదాపు 380 కిలోల బరువున్న హైసిస్‌ భూమి ఉపరితలంపై ఉన్న పరారుణ, విద్యుదయస్కాంత వలయాన్ని కూడా ఛేదించి చిత్రాలు తీయగలదు.

About The Author