కల్లు అంటే ఏమిటి…
దాదాపు కొన్ని సంవత్సరాల కిందటి, ఉమ్మడి పాలన నాటి ముచ్చట.. కల్లుగీతవృత్తిలోకి ఆబ్కారీ శాఖ నెమ్మదిగా చేరుకుంటున్న రోజులవి.
ప్రభుత్వంలో అప్పటికే మత్తు పదార్థాల నిరోధక చట్టంతో ఆబ్కారీ శాఖ ఉన్నది.
స్వేచ్ఛగా ప్రకృతి ఒడినుండి ఔషధ గుణాలు కలిగిన కల్లు జనజీవనంలో భాగమైన సమయంలో “మద్యం” అనే మహమ్మారి కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. జనంను మత్తుకు అలవాటై పోయేలా రంగుల వేశాలు వచ్చినా, కల్లు ఆరోగ్యమనే విషయం జనంకు తెలుసు. మత్తు అలవాటు లేని మనుష్యులకు, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు సారాయి పేరుతో పరిచయం చేసింది ఆబ్కారీ శాఖ. అదేనండి ‘మద్యం’ మత్తు కాలం వ్యాపారానికి (అర్రాజు) టెండర్లతో దుఖ్నం తెరసిండ్రూ. ఊర్లే జనం చక్రంలాగా గిర్రున తిరిగెటోళ్లు. ఈ నేపథ్యంలో “వారుని – వాహిని” పదంతోటి పొట్లాలుగా మార్చీ మత్తు అలవాటుతో ప్రజలకు బాగా చేరువయ్యారు. తొలి ఎపిసోడ్ లో మద్యం తనను తాను పరిచయం చేసుకుంది. మత్తుతోనే తన స్వభావాన్ని చాటుకుంది.
“ఈ భూమ్మీద సమస్త జీవరాశి ప్రకృతిపై ఆధారపడి జీవించే జీవులను చూశాను. అందులో మనిషి ఒకరు. కల్లుతో నడవలేక జనం తిరుగుబాటుతో మత్తు డైనోసార్లు నశించాయి. కల్లు ఆరోగ్య విధానంతో పోటీ పడలేక మత్తు మాయ వైభవం, రణ తేజం సారాయి ప్రభావం నశించింది.
ప్రకృతితో పాటు నడుస్తున్న కల్లుగీతవృత్తి విజయ శిఖరాలపై నిలబడగలుగుతుంది. ఇది నానుడి మాట.. అయినప్పటికీ నిజంగా కాలం లక్షణం ఇదే..! కాలం మానావాతీతమైంది. అందువల్ల దీనికి జాలి, దయ, క్రోదం, ప్రేమ వగైరా మనవ వికారాలేవి ఉండవు. కదిలి పోవడమే దాని కర్తవ్యం. ఎవరికోసమో ఆగదు. “కదిలే కాలమా… కాసేపు ఆగమ్మా. జరిగే మత్తు మాయ మోసంను కళ్లారా చూడమ్మా ” అని బాదల బరువైన గొంతుతో ఎవరు వేడుకున్నా అది ఆగదు.
అనంత కాలగమనంలో గత సంవత్సరాల క్రితం సారాయి గురించి, దాని పేరు మార్పుల లిక్కర్ వ్యవస్థ ముసురుకుంటున్న అనారోగ్యల తత్త్వం గురించి ఈ ఉపోద్ఘాతం.!
నాటి తారీఖుల కాలం విదేశాల సంస్థానాల భారతం. మత్తు పదార్థలను నిరోధించాల్సిన వ్యవస్థ ఆబ్కారీ నిర్మాణంను గతం నుండి ప్రభుత్వాలు మత్తు పదార్థం ప్రోత్సహించే శాఖగా మార్చేశారు. అప్పటి నుంచి ఆబ్కారీ వ్యాపారిగా మారిపోయింది. మత్తు పదార్థలు అమ్మే ఒకే ఒక అధికారిక సంస్థ ఏంటంటే అది ఆబ్కారీ మాత్రమే. పోలీసు వ్యవస్థకే దొంగ వేషం వేసి దోచుకోమన్నట్టూ, మత్తు పదార్థల నిషేధించే సంస్థ మత్తు పదార్థల వ్యాపారం చేస్తే ఎలా.?
వ్యాపార విస్తరణకు అడ్డుగా ఉన్న ప్రకృతి పదార్థం కల్లు జనజీవనంలో భాగమై ఉంది కాబట్టి, ఎలాంటి నిరూపణ లేని ఆధారరహిత ఆరోపణలతో కల్లు ఆల్కహాల్ అని ఆబ్కారీ శాఖలో చేర్చాలని నాటి మద్యం పెట్టుబడిదారులు అధికారంలో పాలనలో భాగస్వామ్యయి, మోసంతో కూడిన విలీనం చేసి నిర్బంధ విధానం రాశారు. మత్తు పదార్థలు మెడలో వేసుకుని తిరుగుతూ… ప్రకృతి జీవనంను మత్తు అని నిందించడం, ఏ సంబంధం లేకున్నా బలవంతపు నిర్భందాలు గెజిట్లో రాసుకుని ఆబ్కారీ శాఖకు అప్పగించారు.
కల్లుకు, ఆబ్కారీ శాఖకు ఎలాంటి సంబంధం లేకున్నా, నేటి తరం ఆబ్కారీని గీతవృత్తి శాఖ అనేంతగా రుద్దారు. ఏ జీవ వైవిధ్యంకు లేని నిర్భందం కల్లుకు ఎందుకంటే.? ప్రజల జీవన విధానంలో భాగమైన సహజ ఔషధ గుణమైన ఆరోగ్య పానీయం కాబట్టి. మద్యం ప్రాణాలను హరించే మహమ్మారి అని జనం స్వీకరిస్తలేనందున మత్తు పదార్థల వ్యాపారి అయిన ఆబ్కారీ శాఖతో అప్పటి ప్రభుత్వాలు దాంట్లో ఉండే లిక్కర్ కంపెనీలు ఉన్న వ్యాపారులు కల్లు పై కక్షతో నివారించాలని ఉద్దేశ్యంతో కొన్ని ఖచ్చితమైన నిబంధనలు పెట్టి హింసించటం మొదలు పెట్టింది.
– చెట్టు నుండి కల్లు వస్తుంది కాబట్టి చెట్టు పన్నులు కట్టాలని.
– జుట్టు పన్నులు కల్లు తీసి జనాలకు పోస్తున్నారు కాబట్టి లైసెన్స్ తీసుకుని వ్యాపారంకు (బైటక్) సుంకం కట్టాలని.
– మీ ఊర్లో కల్లు మీ ఊర్లోనే అమ్మే విధానం. (వారి కంపెనీల తయారైన మద్యం ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటుకు)
ఇలా కల్లు అమ్మే వీలు లేని అనేక నిబంధనలు ఆబ్కారీకి అప్పగించింది. గీతవృత్తికి ఏ అవసరమొచ్చిన ఆబ్కారీ శాఖను అడిగే ఒక విధానం సృష్టించారు. ఆబ్కారీ అంటేనే కల్లుగీతవృత్తి శాఖ అనేంతగా మైండ్ డైవర్ట్ చేశారు.
ఇప్పుడు ఆబ్కారీ శాఖ కల్లుగీతవృత్తి శాఖ అనుకుని మద్యంలో వాటా అనే స్థాయికి తీసుకొచ్చారు. అందులో భాగమే కల్లు వ్యాపారంలో మాకు పోటీ మద్యమే అనుకొని కొన్ని ప్రాంతాల్లో మత్తు రసాయనాలు తీసుకొచ్చి కల్లులో కలిపి కొంతమంది వ్యాపారులు కల్తీ చేస్తున్నారు. దీనిని అలుసుగా తీసుకుని గతం నుండి ప్రభుత్వాలు కల్లు కల్తీ అనే ప్రచారం ముమ్మరం చేస్తూ వస్తున్నాయ్. కానీ కల్లు అంటేనే చెట్టు నుండి పుట్టటానికి భూమిలో ఉండే లవణాలను ఔషధ గుణాలతో కూడిన ప్రకృతి భాండాగారం. సహజ సిద్ద పానీయం. అందుకే కూరకాయలు అమ్మినంత తేలికగా కల్లు ఎక్కడైనా అమ్ముకునే విధానం తీసుకొస్తే విలువ.
కల్లు సంబంధం లేని ఆబ్కారీ శాఖ నుండి తీసివేస్తే.. ఫుడ్ లేదా బెవరేజస్ కార్పోరేషన్ లో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది.
కల్లును నీరగా ప్రోత్సహించి చెట్ల పెంపకానికి కావలసిన భూములు కేటాయిస్తే ప్రజారోగ్యం కాపాడటంలో ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది.
వృత్తిని బంధించి నిర్వీర్యం చేస్తే ప్రభుత్వాలకు వచ్చే వ్యతిరేకతనే ఎక్కువ కాబట్టి ప్రభుత్వ పాలనలో ఉన్న నాయకులు ఆలోచన చేయాలి. తమ గెలుపుకు అధిక ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నందున సహృదయంతో ఆలోచించండి. కొత్త ఆలోచనలకు నాంది పలకండి.
మీకు పేరుతో పాటు మీ గెలుపునకు ఉపయోగపడే గౌడ కల్లు గీత సామాజిక వర్గం అత్యధికంగా జనాభా కలిగిన వారిలో మొదటిది యాదవులు, రెండవది ముదిరాజులు, మూడవది గౌండ్లోల్లు ఉన్నరనేది రాజకీయ నాయకులకు మనవి.
మూడవ స్థానంలో ఉన్న వ్యవస్థను రాజకీయం చేయాలనే ప్రతొక్కరూ ఈ సామాజిక వర్గంకు న్యాయంగా, అండగా నిలబడి మీ నిజాయితీని నిరూపించుకోవాలని విజ్ఞప్తి.
మీ…ఈతముల్లు.!