హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షునిగా టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఎన్నికయ్యారు…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షునిగా టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఎన్నికయ్యారు…
అజహర్ ప్యానెల్‌కు, ప్రకాష్ చంద్ జైన్ ప్యానల్ కు మధ్య గట్టి పోటీ జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రకాష్ చంద్ జైన్‌పై 146 ఓట్ల మెజారిటీతో అజారుద్దీన్ విజయం సాధించారు. అంతకుముందు ఉదయం ఉప్పల్ స్టేడియంలో పోలింగ్ జరిగింది. మధ్యాహ్నానికి పోలింగ్ ముగియడంతో ఆ తరవాత కౌంటింగ్ జరిపారు. ఈ ఎన్నికల్లో 227 ఓట్లకు గాను 223 ఓట్లు పోలయ్యాయి. 2017లో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజార్ నామినేషన్ వేసినా… హెచ్‌సీఏ తిరస్కరించింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఉండడంతో హెచ్‌సీఏ అధికారులు అజార్ నామినేషన్‌ను తిరస్కరించారు. అప్పటికే బీసీసీఐ అతడికి క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ ఆ పత్రాలు సమర్పించలేదన్న కారణంతో నామినేషన్‌ను తిరస్కరించినట్టు హెచ్‌సీఏ అప్పట్లో పేర్కొంది.
గత అధ్యక్షుడు వినోద్ పై హెచ్‌సిఎ కు సంబంధించిన నిధుల కుంభకోణం కేసు విచారణలో ఉన్నందున అతని నామినేషన్ ను ఈ ఎన్నికలలో తిరస్కరించిన సంగతి తెలిసిందే…