ఐక్యరాజ్య సమితి సదస్సులో ఆధ్యంతం ఆకట్టుకున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రసంగం..


భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 9వ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించారు.ఐరాస అధ్యక్షులు మోదీ గారు మాట్లాడతారని చెప్పగానే సభలో చప్పట్లు మారుమోగాయి.

మొదట మహాత్మా గాంధీని గుర్తు చేసుకున్న మోదీ గారు ప్రసంగం మధ్యలో ఓ తమిళకవి గొప్పతనం గురించి ప్రస్తావించారు.చివర్లో స్వామి వివేకానంద గారి సందేశంతో ప్రసంగం ముగించారు.

ప్రధాని నరేంద్ర మోదీ గారు హిందీలో ప్రసంగించారు.దాదాపు 20 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది.
పాకిస్తాన్ పేరు ఎత్తకుండా ఉగ్రవాదంపై ఆయన గళమెత్తారు.ఉగ్రవాదం భారత్‌కు మాత్రమే కాదని,ప్రపంచ మానవాళికి పెను ప్రమాదమని హెచ్చరించారు.

మోదీ గారు ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజా ఆరోగ్య సంక్షేమ పథకం ఆయుష్మాన్ భారత్‌ను ప్రవేశపెట్టామని,ఈ పథకంతో ద్వారా 50 కోట్ల మందికి భారతీయులు ప్రయోజనం పొందుతారని తెలిపారు.

ప్రపంచంలోనే అత్యధికంగా పరిశుభ్రత దిశగా స్వచ్ఛ భారత్ చేపట్టామని,ఐదేళ్లలో 110 మిలియన్ల టాయిలెట్లు దేశవ్యాప్తంగా నిర్మించామని చెప్పారు.

ప్రపంచంలోనే అధికంగా 370 మిలియన్ బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయంచామని
ప్రపంచంలోనే అతి పెద్ద డిజిటల్ గుర్తింపు (బయోమెట్రిక్) తీసుకురావడం ద్వారా 20 బిలియన్ డాలర్ల అవినీతిని అరికట్టగలిగమని మోదీ గారు సదస్సులో తెలియజేశారు.

మోదీ గారు రాబోయే ఐదేళ్లలో 150 మిలియన్ నివాసాలకు మంచినీరు,2025 నాటికి 125 మిలియన్ కిలోమీటర్ల రహదారుల నిర్మాణం మరియు 2025 నాటికి పేదరికం నిర్మూలనే లక్ష్యం భారత ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.

భారత్‌లో కూడా ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్‌పై నిషేధం,భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొనేనాటికి 20 మిలియన్ల ఇళ్ల నిర్మాణం,450 గిగావాట్స్ పునరుత్పాదక ఇంధనం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

About The Author