భారత దౌత్యవేత్త ‘విదిశా మైత్రా’ ప్రసంగంతో ఇమ్రాన్‌ఖాన్‌కు చెమటలు…
భారత దౌత్యవేత్త ‘విదిశా మైత్రా’ ప్రసంగంతో ఇమ్రాన్‌ఖాన్‌కు చెమటలు … రాత్రికి రాత్రి సోషల్ మీడియా స్టార్.
విదిశా మైత్రా… ఈ పేరు ఇపుడు దేశమంతా మార్మోగుతోంది. భారత్‌పై విషం కక్కిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు సర్వప్రతినిధి సభ వేదికగా ఘాటైన జవాబిచ్చిన ఈ మహిళ భారత విదేశాంగ శాఖలో దౌత్యవేత్త. విధాన రూపకల్పన- అధ్యయన వి భాగంలో ఉప కార్యదర్శి హోదాలో ఉన్న ఆమె ఐక్యరాజ్యసమితిలోని భార త రాయబార బృందంలో ఫస్ట్ సెక్రటరీగానూ వ్యవహరిస్తున్నారు. ఇమ్రాన్ ప్రసంగానికి ఎవరి చేత జవాబిప్పించాలి.. అని భారత అధికారులు అన్వేషిస్తున్న సమయంలో వారికి మొదట స్ఫురించిన పేరు శాశ్వత రాయబారి అక్బరుద్దీన్! మంచి పేరున్న ఆయన చేత ఇప్పించాలని అని భావించారు.
కానీ ఇమ్రాన్‌కు సీనియర్ నేతలు, అధికారులతో కాకుండా ఓ అత్యంత జూనియర్ చేత కౌంటర్ ఇప్పించాలని, తద్వారా ఆయన స్థాయిని దిగజార్చాలని భావించి విదిశ మైత్రాను ఎంపిక చేశారు. ఉన్న దౌత్యవేత్తలందరిలో విదిశ కొత్తవారు. 2008 బ్యాచ్ అధికారిణి. కేవలం పదేళ్ల సర్వీసున్న ఆమెకే ఈ బాధ్యతను అప్పగించారు. సివిల్ సర్వీసె్‌సలో 39 వ ర్యాంకును సాధించి, ఐఎ్‌ఫఎ్‌సను ఎంచుకున్న విదిశ తన ట్రైనింగ్ సమయంలోనే అత్యుత్తమ ట్రైనీగా బిమల్ సన్యాల్ స్వర్ణపతకాన్ని సాధించారు. తన ప్రసంగంతో ఆమె రాత్రికి రాత్రి సోషల్ మీడియా స్టార్ అయ్యారు.