ఆధ్యాత్మిక దేవనగరి మన యాదాద్రి…

ఆధ్యాత్మిక దేవనగరి మన యాదాద్రి

92% పూర్తయిన ఆలయ పునరుద్ధరణ పనులు –
ఈ నెలాఖరులోగా ప్రధాన ఆలయ పనులు పూర్తి -అన్నీ తానై పర్యవేక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ -యాదాద్రి గుట్టపై ఆధ్యాత్మిక రాజధాని –
శిల్పకళకు సరికొత్త భాష్యం చెబుతున్న స్థపతులు -భావితరాలకు దిక్సూచిలా నిర్మాణాలు -ఆకట్టుకుంటున్న గోపుర నిర్మాణాలు –
స్వర్ణమయం కానున్న విమానగోపురం –
దేశానికే తలమానికం యాదాద్రి శిల్పసంపద కృష్ణశిలలపై చెక్కబడిన రాజగోపురాల రాజసం ఒకవైపు.. అష్టదిక్కులనూ తమవైపే ఆకర్షిస్తున్నట్టుగా ఉన్న అష్టభుజి మండపాలు మరోవైపు.. తనకుతానే సాటి అన్నట్టుగా ఉట్టిపడుతున్న శిల్పకళా సంపదతో యాదాద్రి.. దేవనగరిగా రూపొందుతున్నది. యాదాద్రి గుట్టపై ఆధ్యాత్మిక రాజధాని సర్వహంగులతో సిద్ధమవుతున్నది. లక్ష్మీనరసింహ ఆలయ పునరుద్ధరణ పనులు తెలంగాణకే తలమానికంగా జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడ ఆలయాల నిర్మాణం జరిగినా యాదాద్రిలో శిల్ప సౌందర్యాన్నే అనుసరించాలనేంత గొప్పగా నిర్మాణం జరుపుకుంటున్నది. ప్రాకారాలు.. యాళి స్తంభాల సోయగం.. లతలు, పొదికల దరహాసముల మేలుకలయిక యాదాద్రి గుట్టపై కనువిందు చేస్తున్నాయి.

About The Author