ఆకట్టుకుంటున్న టెంపుల్ సిటీ…
ఆకట్టుకుంటున్న టెంపుల్ సిటీ..
ప్రధాన గుట్టకు ఎదురుగా గల పెద్దగుట్టపై టెంపుల్‌సిటీ నిర్మాణాన్ని భారీ ఎత్తున చేపడుతున్నారు. దీని లేఅవుట్ కోసం రెండేండ్లుగా పనులు జరుగుతున్నాయి.రూ. 89 కోట్లు వెచ్చించి మొదటి దశలో 250 ఎకరాల స్థలాన్ని కేటాయించి అభివృద్ధి చేశారు. రోడ్లు, ల్యాండ్‌స్కేపింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఒక విల్లాకోసం రెండు కోట్ల నుంచి పదికోట్ల వరకు వెచ్చించనున్నారు. భారీకాటేజీల నిర్మాణం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రెండోదశలో 850ఎకరాల్లో ప్లాటింగ్ చేయనున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డును పోలిన విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుండడం విశేషం. రంగురంగుల పూలమొక్కలతో టెంపుల్‌సిటీ పచ్చని శోభను సంతరించుకోనున్నది. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎనిమిదిసార్లు పెద్దగుట్టను సందర్శించారు. ఇక్కడ కోటినుంచి మూడు కోట్ల వరకు విలువైన భారీ భవనాల నిర్మాణాల కోసం సీఎం ఇప్పటికే అనుమతులిచ్చారు. దీంతో ఈ నిర్మాణాలు చేపట్టేందుకు భక్తులు అధికసంఖ్యలో ముందుకొస్తున్నారు. రూ. 7.5 కోట్లు ఖర్చుతో నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణం పనులు కూ డా ఊపందుకున్నాయి. రాష్ట్రపతి, ప్రధాని లేదా సీఎం వచ్చినప్పుడు వీటిని కేటాయిస్తారు. యాదాద్రి ప్రపంచపటంలో ఓ అద్భుత పుణ్యక్షేత్రంగా నిలువనున్నది.. లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక రాజధానిగా గణతికెక్కడానికి మరెంతో దూరం లేదు.. యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కృష్ణశిలలో జరుగుతున్న నిర్మాణాలు దేశంలో ఏ ఇతర ఆలయానికి చేకూరని శోభను కలిగిస్తున్నాయి.. శ్రీలక్ష్మీనరసింహుని దయతో త్వరలోనే నిజదర్శనాలు ప్రారంభమవుతాయి.