ఈరోజు నుండే మార్గశిర మాస ప్రారంభం…
ఈరోజు నుండే మార్గశిర మాస ప్రారంభం.
ఈరోజు నుండే మార్గశిర మాసం ప్రారంభం. శనివారంతో కుడి మొదలైంది.నారాయణునికి ఇష్టమైన మాసం, నారాయణుడు స్వయంగా తానే మాసాల్లో మార్గశీర్ష మాసం అని ప్రకటించుకున్న గొప్ప మాసం.మృగశిర నక్షత్రం పౌర్ణమి తో కుడి యున్న మాసం మార్గశిర మాసం.కార్తీక మాసం లో తమతమ పరిస్థితుల దృష్ట్యా, సమయాభావం వల్ల కార్తీక మాసం నియమాలు పాటించని వారు ఈ మాసం లో చేసే నారయణ ఆరాధన వల్ల తరించవచ్చు. పేరులోనే ఉంది మార్గ . . శీర్షమని అనగా భగవంతుని అనుగ్రహము పొందుటకు ఉత్తమమైన మాసం అని అంతరార్ధం. హేమంత ప్రారంభం కూడా ఇదే మొదటి మాసం.
ఖగోళశాస్త్ర దృష్ట్యా చాంద్రమానంలో ఇదొక గొప్ప మాసం లౌకికమైన కారణాల దృష్ట్యా. . . పారమార్థిక భావనలో జ్ణాన, ఉపనిషత్ మార్గంలో ముక్తి పొందుటకు అవసరమైన భగవత్ గీత పుట్టిన మాసం ఇదే . . . సౌరమానంలో వైష్ణవులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ధనుర్మాసం కూడా ఇదే. చాలా ఆలయాల్లో ఈ మాసం అంతా తిరుప్పావై ఆరాధన చేస్తారు. గోదాదేవిని ఆరాధించే సంప్రదాయం కూడా ఉంది.విల్లిపుత్తూరు లో పురాణ కాలంలో ఇదే తిరుప్పావై పాశురాల పఠనంతో గోదాదేవి తల్లి శ్రీహరిని పొందిన పవిత్ర మాసం.మనకు అంత భక్తి లేకపోయినా కూడా కలియుగంలో నామ పఠన, స్తోత్ర పారాయణ వల్ల శ్రీమన్నారాయణుని అనుగ్రహము పొందవచ్చు.ఈ మాసం మొదలు ఎన్నో పండగలు ప్రారంభం అవుతాయ్.ఈరోజున మార్గశిర శుక్ల ప్రతిపద . . మూల నక్షత్ర శనివారం.
ఈరోజు సాయంత్రం చంద్ర దర్శనం చేయాలి.ఈరోజు ఉదయాన గంగా స్నానం లేదా నది స్నానం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది.నారాయణ ఆరాధన మొదలు పెట్టడం కోసం అనువైన రోజు
జై శ్రీమన్నారాయణ