జయలలిత గారి వర్థంతి నేడు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాము…
జయలలిత గారి వర్థంతి నేడు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాము
అధ్బుతమైన..నటి..అసాధారణప్రజ్ఞాశాలి..ద్రవిడప్రజల..దైవం….తమిళనాడుముఖ్యమంత్రి అమ్మా అంటూ తమిళ ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే’ “ధీర వనిత జయలలిత వర్ధంతి నేడు”. జయలలిత తమిళనాట పుట్టి అమ్మగా అందరి మన్ననలు పొందిన వీర వనిత. చక్కని చుక్క, నిలువెత్తు అభిమానం, నిండైన విగ్రహం, ఎంతటి కష్టమొచ్చినా చెదరని నిబ్బరం, ఎదుటివారు ఎంతటి వారైనా లక్ష్య పెట్టని ధీరత్వం, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ధీశాలి, అలుపెరగక పోరాడిన రాజకీయ విప్లవ నాయకి. మంచితనం తో వంచనకు గురి అయిన అమాయకపు రారాణి. నటనలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని మహారాణి లా కొన్నాళ్ల పాటు సినీ రంగం లో చెరగని ముద్ర వేసుకున్న అందాల తార జయలలిత. ముద్దుగా ఉండే ఈ బొద్దు గుమ్మ కళ్ళతోనే అభినయించి ఎందరో హృదయాలు దోచుకుని సెలవంటూ నింగిని తారై వెలగడానికి వీడ్కోలు తీసుకున్న ఈ పసిడి తారకి ఆత్మీయ నివాళులర్పిస్తూ