రైల్వేలో ఉద్యోగాలు: టికెట్ క్లర్క్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి
భారతీయ రైల్వేలో భాగంగా వెస్ట్రన్ రైల్వే హుబ్లీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, మరియు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 386 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు నవంబర్ 20 , 2019 చివరితేదీ.
సంస్థ పేరు: సౌత్ వెస్ట్రన్ రైల్వే
పోస్టు పేరు: టికెట్ క్లర్కు
పోస్టుల సంఖ్య: 386
జాబ్ లొకేషన్: హుబ్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: 20 నవంబర్ 2019
విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 47 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష
అప్లికేషన్ ఫీజు: ఫీజు మినహాయింపు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 23 అక్టోబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 నవంబర్ 2019