ఇంటి వద్దకే డీజిల్ పంపిణీ చేస్తారు.
ఇక మీరు డీజిల్ కోసం పెట్రోల్ బంకుల కోసం వెళ్లనక్కర్లేదు.నేరుగా ఇంటి వద్దకే పంపిణీ చేస్తారు. ఎంతకావాలంటే అంత ఆర్డర్ చేసుకుని ప్రయాణం చేసేయొచ్చు. కానీ ఇది కార్యరూపం దాల్చడానికి కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. అయితే..ఇది మెట్రో నగరాల్లో మాత్రమే. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ దీనిపై కసరత్తు చేస్తోంది. నివాసాల వద్దకే డీజిల్ సరఫరా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. పెట్రోలియం ఎక్స్ ప్లోజివ్స్ భద్రతా విభాగం (PESO)తో సంప్రదింపులు జరుపుతోంది కేంద్రం.
ఇవి పురోగతిలో ఉన్నాయని తెలుస్తోంది. 2020 జనవరి నుంచి ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని అమలు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వినియోగదారులకు నేరుగా డీజిల్ అందించేందుకు చమురు సంస్థలు ఒక యాప్‌ను కూడా రెడీ చేశాయి.
ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని డీజిల్ కావాల్సి వచ్చినప్పుడు తన పేరు, చిరునామా తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అంతే..డీజిల్ ట్యాంకర్ సంబంధిత వినియోగదారుడి ఇంటి ముంద ఆగుతుంది. డీజిల్ పోయగానే..డబ్బును యాప్ ద్వారా చెల్లించే సౌకర్యం కూడా కల్పించారు. కానీ ఇది అందుబాటులోకి రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే