ఇంజినీరింగ్ నైపుణ్యంతో కడుతున్న ఈ భవనం చూసారా..!
పురాణాలలో… ఇతిహాసాలలో చూడడమే ఏమిటి మనం నిర్మించ లేమా అని అనుకున్నట్టు న్నారు… ఈ ఇంజనీర్లు.. ఇంజినీరింగ్ నైపుణ్యంతో కడుతున్న ఈ భవనం హైదరాబాద్ హైటెక్ సిటీలో నిర్మితమవుతోంది. టీహబ్ రెండోదశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిని చేపట్టింది. మధ్యలో పిల్లర్లు వేసి ఒకవైపు 60 అడుగులు మరోవైపు 40 అడుగుల వెడల్పుతో పది అంతస్థుల భవనాన్ని కడుతున్నారు. గాలిలో నిర్మిస్తున్నట్లుగా ఉన్న ఈ నిర్మాణం చూపరులను ఆకట్టుకుంటోంది.