చెక్ పోస్టుల వద్ద వాహన ప్రయాణీకులకు ఆర్ఎఫఐడి తో సమయం ఆదా.. ట్రాఫిక్ సమస్యకూ పరిష్కారం …

డిసెంబర్ 11 నుంచి ఆర్.ఎఫ్.ఐ.డి. ఫాస్టాగ్ అధికారికంగా అమలు
ఓఆర్ఆర్ టోలు వసూలు లో చిల్లర బాధలకు చెల్లు
ఓఆర్ఆర్ చెక్ పోస్టుల వద్ద వాహన ప్రయాణీకులకు ఆర్ఎఫఐడి తో సమయం ఆదా..
ట్రాఫిక్ సమస్యకూ పరిష్కారం …..

ఔటర్ రింగ్ రోడ్ టోలు వసూలు ప్రక్రియలో హెచ్ఎండీఎ తలపెట్టిన అత్యాధునిక ఆర్ఎఫ్ఐడి ఫాస్టాగ్ (RFID FASTag ) ఎలక్ట్రానిక్ పద్దతిని ఈ నెల 11 నుంచి ( డిసెంబర్ 11 ) అధికారిరంగా అమలు చేస్తున్నట్లు హెచ్ఎండీఎ కమీషనర్ డా. బి. జనార్ధన్ రెడ్డి తెలిపారు. తార్నాకా లోని హెచ్ఎండీఎ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన అధికారుల సమీక్షా సమావేశంలో గత కొద్ది రోజులుగా ప్రయోగాత్మకంగా అమలు జరుగుతన్న ఆర్ఎఫ్ఐడి ఫాస్టాగ్ (RFID FASTag ) ఎలక్ట్రానిక్ పద్దతిన టోలు వసూలు ప్రక్రియలోని సాధక బాధకాల గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి చెందారు.
ఈ పధకం పై ఓఆర్ఆర్ ద్వారా ప్రయాణించే వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కమీషనర్ అధికారులను ఆదేశించారు.
హెదరాబాద్ నగరం చుట్టూ 158 కి. మీ. పొడవున్న ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు పై పలుచోట్ల ఉన్న టోల్ కలెక్షన్ సెంటర్ల వద్ద చిల్లర సమస్యతో పాటు రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ వల్ల పలు వాహన దారులకు టోల్ గేటు వద్ద వాహనాలు బారులు తీసి ఉండాల్సి వస్తోందని, ఈ సమస్యకు టోల్ రుసుముల చెల్లింపుల లో అవసరమైన చిల్లర నోట్లు లేకపోవడం ఎత్తయితే, నిర్ధారిత సమయాలలో పెరుగుతున్న వాహన రాక పోకల సంఖ్య కూడా ముఖ్య కారణం అని ఆయన తెలిపారు.
అందువల్ల గత కొద్ది రోజుల క్రితం ఆర్.ఎఫ్.ఐ.డి. (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ఆధారిత టోలు రుసుము చెల్లింపు( ఈటీసి- ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్) ను ప్రయోగాత్మకంగా అమలు చేసిన అనంతరం ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న తరువాత అధికారికంగా ఈ పద్దతిన టోలు వసూలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
1. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడి) ఆధారిత ఎలక్ట్రానిక్ టోలు రుసుము వసూలు పద్దతి.
2. కాగిత రహితమైన వ్యక్తిగమైన లావాదేవీలు (ఇచ్చి పుచ్చుకునే పద్దతి)( పేపర్ లెస్ మాన్యుల్ సిస్టమ్)
ప్రస్థుతం ఆర్.ఎఫ్.ఐ.డి. (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ఆధారిత టోలు రుసుము చెల్లింపు అమలు జరుగతుంది.. ఈ పద్దతి 19 ఇంటర్ ఛేంజ్ ఓఆర్ఆర్ కలెక్షన్ చెక్ పోస్టుల్లో అమలు చేయబడటంతో టోలు రుసుము వసూలును మరింత్ సమర్ధవంతంగా అమలు చేయవచ్చని ఆయన ఆన్నారు. ఈ పద్దతి అమలు వల్ల డబ్బులు ఇచ్చిపుచ్చుకునే సమయం మరియు వేచి ఉండే సమయాన్ని తగ్గించవచ్చని, టోలు ప్లాజాలా వద్ద పొడవాటి వరుసలను తగ్గించవచ్చన్నారు. అలాగే వాహన కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. ఈ పద్దతి అమలు చేస్తూ వాహన ప్రయాణీకులకు మరిన్ని ప్రయోజనాలు అందిస్తున్నామని, అడ్వాన్సు గా వాహన దారులు(ప్రయాణీకులు) రుసుము చెల్లించడం వల్ల ఈటీసి వల్ల వచ్చే అదనపు ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.
ఆర్ఎఫ్ఐడి (ఈటీసి) పద్దతిః
ఫాస్ట్ ట్యాగ్ (FasTag) పాన్-ఇండియా ఈటీసి పద్దతి ని, జాతీయ ఎలక్ట్రానిక్ టోలు వసూలు (ఎన్ఈటీసి) కార్యక్రమం క్రింద కేంద్ర ప్రభుత్వ జాతీయ రవాణారోడ్డు విభాగం ద్వారా అమలు జరుగుతున్నది. అయితే ఆర్ఎఫ్ఐడి ఆధారిత ఈటిసి పద్దతిన టోలు రుసుము వసూలు చేయడం వల్ల అంతకు మించి ఉపయోగకరంగా ఉంటుంది. ఫాస్టాగ్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా వెళ్ళే వ్వవస్ధ ఉంటుంది. ముందుగా నగదు రహిత చెల్లింపుల సౌకర్యముతో పొందే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడి) ట్యాగ్ వాహనానికి ముందు భాగాన అమర్చడం వల్ల వాహనం టోలుగేటు వద్దకు రాగానే ఆర్ఎఫ్ఐడి గుర్తింపు ట్యాగ్ వల్ల ఆటోమెటిక్ (దానంతట అదే) గేటు తెరుచుకుంటుంది. దీని వాల్ల వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. ఆన్ లైన్, నగదు రహిత చెల్లింపులతో కూడీన ఈ పద్దతి వల్ల వత్తిడితో కూడిన అవాంతరాలను తొలగించుకోవచ్చు. అలాగే అమూల్యమైన సమయాన్ని వృధా కాకుండా నియంత్రించవచ్చు. అలాగే టోలు వసూలు ప్రక్రియలో మేనేజ్ మెంట్ భారాన్ని కూడా తగ్గించవచ్చు. అంతే కాకుండా టోలు వసూలు లో వాహన ప్రయాణీకులు దురుపయోగానికి పాల్పడే అవకాశం ఉండంకుండా నిర్ధారిత టోలు వసూలు చేయడం జరుగుతుంది.
ఈ పద్దతిన వసూలు చేసే టోలు సుంకానికి సంబంధిత ఏజన్సీనే బాధ్యత వహిస్తుంది. ఫ్యాస్ట్యాగ్ లావాదేవీల వ్యవస్ధ ఐసిఐసిఐ బ్యాంకు భాగస్వామ్యంతో ఎఫ్కాన్ సంస్ధకు అప్పగించడం జరిగింది. నిప్పాన్ కోఎ కంపని లిమిటెడ్, మరియు ఐటిఎస్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ ప్రయివేటు లిమిటెడ్ సంస్ధలు ద్వారా అవసరమైన సాంకేతిక సహకారం తీసుకోబడ్డది.
నానక రామ్ గూడ, శంశాబాద్, మేడ్చెల్, ఘట్కేసర్ మరియు పటాన్చెరు లలోని టోల్ ప్లాజా కేంద్రాలలో ఈ ఫాస్ట్ ట్యాగ్ ల విక్రయకేంద్రాలు ఏర్పాటు చేయబడినవి. ఐసిఐసిఐ బ్యాంకు వారు ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు దారులకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తున్నది.
1. ఫాస్ట్ ట్యాగ్ లు ఉచితంగా జారీ చేయబడుతున్నాయి.
2. మొదటి 2 లక్షల వాహనాలు, కార్లు/జీపులు తదితర చిన్నతరహా వాహనాల కేటగిరీలోని వాహనాలకు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే జారీ చేయబడుతుంది.
3. ముందుగా నిధుల నిల్వ ఉన్నట్లయితే ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాల రాకపోకలపై ఎలాంటి నియంత్రమ ఉండదు. ( అన్ లిమిటెడ్). అంతే కాకుండా టోలు ప్లాజాలో ఫాస్ట్ ట్యాగ్ కలిగి ఉన్న వాహనాలకు వెళ్ళుటకు ప్రత్యేక దారి ఏర్పాటు ఉంటుంది.
4. తరుచుగా ప్రయాణించే ప్రయాణీకులు నెలసరి పాసులు కూడా కొనుగోలు చేసుకునే వెసులు బాటు ఉంది. ఆన్ లైను లో కాని ఫాస్ట్ ట్యాగ్ విక్రయకేంద్రాలైన 5 టోలు ప్లాజాలలో కూడా నెలసరి పాసులు కొనుగోలు చేయవచ్చు. నెలలో 50 సార్లు ప్రయాణించే వారికి నెలసరి పాసు చెల్లుబాటు ఉంటుంది. నెలసరి పాసు కొనుగోలు చేసిన వారికి 24 గంటలలోని తిరుగు ప్రయాణములో రాయితీ కూడా లభిస్తుంది.

About The Author