శ్రీ కోదండరామాలయానికి బంగారు ఆభరణం విరాళం
తిరుపతి: తిరుపతి చెందిన ఎన్ఆర్ఐ భక్తుడు శ్రీ సి.శివకుమార్ తిరుపతిలోని శ్రీ కోదండరామాలయానికి లక్ష్మీ డాలర్‌తో కూడిన బంగారు చైన్‌ను గురువారం విరాళంగా అందించారు.
58.848 గ్రాముల విలువ గల ఈ ఆభరణం విలువ రూ.2.58 లక్షలు అని దాత తెలిపారు. ఈ మేరకు ఈ ఆభరణాన్ని ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతికి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎఇఓ శ్రీ మునికృష్ణయ్య, సూపరింటెండెంట్ శ్రీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.