చాకచక్యంగా ఇద్దరు స్మగ్లర్లు ను అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్: 45 దుంగలు స్వాధీనం
తిరుపతి:టాస్క్ ఫోర్స్ పోలీసులను దారి మళ్లించే ప్రయత్నం చేసిన ఎర్ర చందనం స్మగ్లర్లు విఫలమయ్యారు. తెలివి మీరిన తమిళ స్మగ్లర్లు నాలుగు దుంగలు కారులో స్మగ్లింగ్ చేస్తున్నట్లు నమ్మించి, మరో వైపు 41 దుంగలను రవాణా చేస్తుండగా ఆర్ ఎస్ ఐ విజయ్ టీమ్ చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ పి రవిశంకర్ ఆదేశాల మేరకు డీఎస్పీ అల్లా బక్ష్ సూచనలతో ఆర్ ఎస్ ఐ విజయ్ టీమ్ శ్రీవారిమెట్టు బీట్ లో గురువారం సాయంత్రం నుంచి కూంబింగ్ చేపట్టారు. లక్ష్మీపురం చెరువు వద్ద స్మగ్లర్ల పాదముద్రలు కనిపించడంతో వాటిని అనుసరించారు.
అక్కడ ఒక కారులో నాలుగు దుంగలు కనిపించాయి. అనుమానం కలిగిన టాస్క్ ఫోర్స్ బృందానికి మరి కొంత దూరం వెళ్లి చూడగా దాదాపు 40 మంది స్మగ్లర్లు దుంగలు మోసుకుంటూ వెళుతున్నారు.
టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిపై దాడి చేశారు. దీంతో స్మగ్లర్లు దుంగలను పడవేసి పారిపోగా ఇద్దరిని పట్టుకో గలిగారు. వారిని తమిళనాడు తిరువన్నామలై జిల్లా పులివీరు గ్రామంకు చెందిన అన్నామలై రామస్వామ