తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో సీఎం శ్రీ కేసీఅర్ మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్లో మీడియాని ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్
ఈ సందర్భంగా సీఎం శ్రీ కేసీఅర్ మాట్లాడుతూ..
* ఇది సకల జనుల విజయం.
* ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను.
* ఇదే సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు.
* మీ కష్టానికి తగిన ఫలితం దక్కింది. మంచి విజయం సాధించాం.
* ఈ విజయం మన బాధ్యతను మరింత పెంచింది అని గుర్తుంచుకోవాలి.
* మన తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలి.
ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో రాజీ లేకుండా ముందుకు పోవాలి.
* పోడు భూముల పరిష్కారం కోసం ఇచ్చిన మాట ప్రకారం ఆరు నెలల్లో ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొంటాము.
* నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్తాము.
* ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పనకు మరింత కృషి చేస్తాం.
* విజయం ఎంత ఘనంగా ఉందో, బాధ్యత కూడా అంతే బరువుగా ఉంటుంది.
* ఆరోగ్య తెలంగాణ కోసం తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందించి ప్రజలకు ఆరోగ్య సమస్యలు పరిష్కారం దిశగా కృషి చేస్తాం.
* ప్రజల సమస్యలు కేంద్ర బిందువుగా, పరిష్కారమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడతాం.
* రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎక్కడా ఒక చిన్న సంఘటన కూడా జరగలేదు.
* మీడియా కూడా చాలా చక్కటి పాత్ర పోషించింది
* దేశ రాజకీయాల్లో కూడా మన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది.
* అస్థిత్వం కోసం పోరాడిన తెలంగాణ ఇప్పుడు తనని తాను ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది
* కేంద్ర రాజకీయాల్లో ఒక చురుకైన పాత్రను టిఆర్ఎస్ పార్టీ పోషించబోతోంది.
* ముమ్మాటికీ కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కావలసిందే.
* మేము ఎవరికీ ఏజెంట్లు కాదు.. ముమ్మాటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధులుగా మాత్రమే ఉంటాము.
* దేశం మొత్తం మీద మనకు 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. కానీ కేవలం 30000 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంటున్నాము.
* ఇది తల దించుకోవాల్సిన విషయం.
* దేశంలో 15 కోట్ల మంది రైతులు ఉన్నారు.
* తెలంగాణ రైతు సమస్యలను పరిష్కరించడానికి స్ఫూర్తిదాయకంగా టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకున్న చర్యలను స్వామినాథన్ సైతం మెచ్చుకున్నారు.
* పార్టీ అభ్యర్థులు కొన్ని చోట్ల ఓడిపోవడానికి కారణం స్వయం తప్పిదాలే.
* కాంగ్రెస్ పార్టీ గెలిచిన రాష్ట్రాల్లో మరో ప్రత్యామ్నాయం లేకపోవడమే కారణం.
* సాంప్రదాయక రాజకీయ పరిస్థితుల నుండి దేశం బయట పడాలి.
* ఒక్క నెల రోజుల్లో మీరు ఒక గుణాత్మకమైన మార్పు చూడబోతున్నారు. త్వరలో డిల్లీకి వెళ్తున్నా.
* విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పూర్తి అభివృద్ధి బాధ్యతలను కేంద్రం రాష్ట్రాలకే వదిలేయాలి.
* తెలంగాణలో రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది
* రైతు సంక్షేమం కోసం ఒక ప్రణాళిక బద్ధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది.
* ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రధాని స్థాయి వ్యక్తులు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశారు.
* చంద్రబాబుకు తెలగాణా రాజకీయాల్లో ఉన్న ఆసక్తి కి తగ్గట్లుగానే, ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము
* నేను ఎవరి వైపు అని అడగడానికి చంద్రబాబు ఎవరు ?
* డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం విషయంలో ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాము.
* ఫెడరల్ ఫ్రంట్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. ఇది యావత్ దేశ ప్రయోజనాలకు సంబంధించినది.