భారతసైన్యం చేతిలో స్నిపర్ రైఫిల్స్!
నేరుగా ఇండియన్ ఆర్మీను ఢీ కొట్టే ధైర్యంలేక సరిహద్దుల వద్ద పాకిస్థాన్, స్నిప్పర్లను రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. అయితే అందుకు కౌంటర్ గా భారత్ కూడా స్నిప్పర్లను రంగంలోకి దించింది.
కాని భారత్ వద్దనున్న స్నిప్పర్ రైఫిల్స్ రేంజ్ 800 మీటర్లు మాత్రమే కావడంతో పాక్ బలగాలు తరచుగా తప్పించుకుంటున్నాయి. దీనితో భారత్ యుద్ధ ప్రాతిపదికన 5,719 అత్యాధునికమైన స్నిప్పర్ రైఫిల్స్ ను కొనుగోలు చేస్తుంది. అవి బెరెట్టా M95, స్కార్పియన్ TGT స్నిప్పర్ రైఫిల్స్. వీటి రేంజ్ దాదాపు 2000 మీటర్లు.
అంటే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ద్వంసం చేయగలవు. పైగా ఇవి .338 లుపూవా మాగ్నం రైఫిల్స్ కావడంతో వీటి తీవ్రత సాధారణ రైఫిల్స్ కన్నా చాలా చాలా ఏక్కువగా ఉంటుంది. కాగా మొదటి విడత 1800 సిప్పర్ రైఫిల్స్ ను వచ్చే నెలలొనే ఇండియన్ ఆర్మీకి అందనున్నాయి