రోడ్లపై పుట్టినరోజు వేడుకలు చేస్తే సహించేది లేదు…


ఇటీవలి కాలంలో రోడ్లపై పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఒక ట్రెండ్ గా మారి ఎంతోమంది చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఇబ్బందికరంగా పరిణమిస్తుంది.
బంధుమిత్రులతో మరియు స్నేహితులతో కలిసి చేసుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలు ఇటీవలి కాలంలో యువకులు మిత్రులతో కలిసి రోడ్లపై మరియు వీధి చివరలో చేసుకుంటూ, మద్యం సేవిస్తూ రోడ్డుపై వచ్చి పోయే వారికి, ఆ ప్రాంతంలో నివసించే వారికి అసౌకర్యం కలిగిస్తున్న విషయం దృష్టికి వస్తున్నది.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై దృష్టిసారించాలని ఎంతోమంది యువకులు ఇంట్లో తల్లిదండ్రులకు తమ మిత్రుల పుట్టినరోజు వేడుకలు ఉన్నవని, వాటికి హాజరవుతానని చెప్పి బయటికి వెళ్లి మిత్రుల పుట్టిన రోజు వేడుకల్లో మద్యం సేవించి, తన మోటార్ సైకిల్ పై తిరుగు ప్రయాణంలో ప్రమాదాలకు గురై మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కావున తల్లిదండ్రులు అర్ధరాత్రి తమ పిల్లలు బయటికి వెళ్తే వారిని మద్యం సేవించ కుండా తిరిగి వచ్చే విధంగా హెచ్చరించి జాగ్రత్తగా ఇంటికి కి చేరుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉన్నది.
యువత కూడా తమ మిత్రుల పుట్టినరోజు వేడుకలు రోడ్లపై కాకుండా ఇతరులకు ఇబ్బంది అసౌకర్యం కలిగించకుండా హోటల్ లోనో లేక ఇండ్ల లో జరుపుకోవాలని తెలియజేస్తున్నాం.
ఒకవేళ ఎవరైనా ఇప్పటి నుండి అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకలు రోడ్లపై జరుపుకుంటూ కనిపిస్తే బ్లూ కోర్స్ మరియు పెట్రోల్ కార్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని వారిపై చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం
యువకులు తెలిసో తెలియకో ఇటువంటి వేడుకల్లో పాల్గొనడం వల్ల
1) రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
2) ఇతరులకు అసౌకర్యం కలుగుతుంది
3) పొరపాటున ఏదైనా కేసులో కనుక ఇరుక్కుంటే భవిష్యత్తులో వారికి విద్య ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని తెలియజేస్తున్నాం
కావున యువకులు ఇలాంటి పోకడకు పోకుండా చక్కటి వాతావరణంలో ఒక స్థలంలో గాని హోటల్ ఫంక్షన్ హాల్ లాంటి వాటిలో గాని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని తెలియజేస్తున్నామని కరీంనగర్ పోలీసులు విజ్ఞప్తి చేసారు.

About The Author