హ్యాపీ బర్త్ డే రీయల్ మ్యాన్, సూపర్ స్టార్ రజనీకాంత్.

హ్యాపీ బర్త్ డే రీయల్ మ్యాన్, సూపర్ స్టార్ రజనీకాంత్.

ఆయన నిలుచుంటే స్టైలే, నడిస్తే స్టైలే,
చిరువవ్వు స్టైలే, సిగరెట్టు ఎగరేస్తే స్టైలే..
ఆయన స్టైల్ గురించి మనం చెప్పఖ్కర్లేదు..
స్టైలే రజిని గురించి చెబుతుంది..!!
భారతావణిలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు ప్రముఖ హీరో రజినీకాంత్..!!

ఎంత ఎదిగినా ఒదిగేతత్వం..
సినిమా వాళ్లకు ఇగో, డబ్బూ. డాబూ ఇమేజే ఇలా ఎన్నో అడ్డొస్తుంటాయి.. వాటన్నింటిని కాదని తానొక ప్రత్యేకతను చాటుకున్న నిజమైన హీరో రజిని.
ఫెరారి, బెంజ్ కార్లు ఎక్కే స్థాయి ఆయనది.. అయినా అంబాసిడరే వాడతారు..

ఆయన వ్యక్తిత్వం హిమాలయం..
హీరో గా ఆయన స్థాయి హిమాలయం..
ఆయనకిష్టమైన స్థలం హిమాలయం..
వెరసి ఆయనే ఒక హిమాలయం.!!

బస్సుల్లో ఎక్కి నిలబడతారు అదేంటని ప్రశ్నిస్తే .. నా స్థాయి ఇక్కడనుండే మొదలైందంటారు
తాను కండక్టర్ గా పని చేసిన రోజులను మరవకుండా..!
మెరీనా బీచ్ లో పల్లీ బఠాణీ తింటూ కాకా హోటళ్లో టీ లు తాగడమే ఆయన ఇష్టపడతారు..
షూటింగ్ లో తప్ప మిగతా సమయంలో కనీసం పౌడర్ కూడా వాడరు. నన్ను నన్నులా జనాలకు చూపించడానికి సిగ్గెందుకు అని ప్రశ్నిస్తాడు. అయనకు గొప్ప హోదాలో ఉన్న ప్రాణ స్నేహితులు ఎక్కువగా లేరు.. అయినా చెప్పా పెట్టకుందా వాళ్ళింటికి వెళ్తారు. అతిథి మర్యదలు తనకి నచ్చవు.. వారితో పాటు నేలపై కూర్చిని భోంచేసి.. అక్కడే పడుకుంటారు.. మనస్పూర్తిగా ఆనందం తనుపొంది అందరికీ పంచుతారు.. హిమాలయాలకు వెళ్ళినప్పుడు తనకు అత్యంత ప్రియమిత్ర్లులతోపాటు వెళ్తారు. ఇంత డబ్బుండీ సుఖం లేకుంటే ఏమి లాభం అనే ప్రశ్న మనకు రావచ్చు. కానీ సుఖాలను త్యాగం చేయడంలో ‘ధ్యానం’ ఉంది అని చెప్తారు రజినీ.
అలాంటి గొప్ప ఆలోచనలు ఉన్నందునే సూపర్ స్టార్ గా కూడా నిరాడంబరంగా జీవిస్తున్నారు.

ఈ రోజు రకినీకాంత్ 63వ పుట్టిన రోజు. (డిసెంబరు 12, 1950)
ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. జన్మతః మరాఠీ. కర్ణాటక లో కొంతకాలం నివసించాడు. ప్రస్తుత నివాసం చెన్నై. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నటుడు. తెలుగు లోనే కాదు మిగిలిన భారతీయ భాషల్లోనూ నటించడమే కాకుండా హాలీవుడ్ లో కూడా పేరు తెచ్చుకున్నారు.
రజినీ భారతీయ చలన చిత్రసీమకు మకుటం లేని మహరాజు..!! వారి జీవితం ఎందరికో ఆదర్శం.
ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఇదే ఆనందంతో ఇంకా ఎన్నో ఆణిముత్యాలను భారతావనికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ …
రజినీ కాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుంటుంది 9StaarTv

About The Author