రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ వారి రిపబ్లిక్ సమ్మిట్ ముఖాముఖి కార్యక్రమంలో శ్రీ అమిత్ షా…


రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ వారి రిపబ్లిక్ సమ్మిట్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారిని యాంకర్ మహారాష్ట్ర ఎన్నికలకు ముందు మిత్ర పక్షంగా ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాల తరువాత ముఖ్యమంత్రి పదవి రెండున్నర ఏళ్ళు బీజేపీ,రెండున్నర ఏళ్ళు శివసేనకు వర్తించేలా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు స్వయంగా అమిత్ షా మాట ఇచ్చారని శివసేన చేస్తున్నఆరోపణకు వివరణ అడ్డగ్గా అమిత్ షా గారు స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

● ఎన్నికలకు ముందు మిత్రపక్షంగా ఉండి కలిసి పోటీ చేసిన శివసేనకు ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి హామీ ఇవ్వలేదని తేల్చి చెప్పారు.

● పూర్వపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంచి పరిపాలన రాష్ట్రానికి అందించారు.ముఖ్యంగా బీజేపీ జాతీయ పార్టీ అయి ఉండి అలాంటి హామీ ఎందుకు ఇస్తుందని ఆరోపణలను తిప్పికొట్టారు.

● ఒకవేళ అలాంటి హామీ ఇచ్చి ఉంటే ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారం కలసి చేసినప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవిస్ అని ప్రచారం చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని తిరిగి ప్రశ్నించారు.

● ఎన్నికల తరువాత బీజేపీ స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్య లేకపోవడంతో వారు ముఖ్యమంత్రి పదవి కోసం బేరమాడుతున్నారని ఎన్నికల ఫలితాల అనంతరం కూడా మేము ఎలాంటి హామీ ఇవ్వలేదని సృష్టం చేశారు.

● ఉద్ధవ్ ఠాక్రే మొదలు కొని శివసేన ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ నరేంద్ర మోదీ పోస్టర్ పెట్టుకుని ఎన్నికలు గెలిచారని మహారాష్ట్ర ప్రజలందరికి తెలుసని తేటతెల్లం చేశారు.

● “ఎన్నికలకు ముందు నుంచే బీజేపీ, శివసేన కలిసి ఎన్నికలకు పొత్తుతో వెళ్లాయని, శివసేన పోటీ చేసిన స్థానాల్లో బీజేపీ,
బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో శివసేన పోటీ చేయలేదని అమిత్ షా గారు స్పష్టం చేశారు. భాజపా, శివసేన కూటమికి ప్రజలు పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు”.

● ప్రజలు దేవేంద్ర ఫడ్నవిస్ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి పనులని చూసే తమ మద్దతు అందించారని ఆయన అన్నారు.

● ఎన్నికల ముందు జరిగిన అన్ని ర్యాలీలలో, ప్రచార సభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు, పార్టీ అధ్యక్ష హోదాలో నేను బీజేపీ శివసేన కూటమి గెలిస్తే ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని, ఫడ్నవిస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నప్పుడు ఎవ్వరు వ్యతిరేకించలేదని చెప్పారు.

● మేము పోటీ చేసిన సీట్లలో 70% సీట్లు గెలిచామని అదే విధంగా శివసేన పోటీ చేసిన సీట్లలో 40% వరకే గెలిచారని, అలా చూసినా ప్రజల మద్దతు బీజేపీతోనే ఉందని అమిత్ షా పేర్కొన్నారు.

● ప్రజలు బీజేపీ-శివసేన కూటమిని ఎన్నుకుంటే, ప్రజల తీర్పును అపహాస్యం చేస్తూ ప్రజా ఆమోదానికి వెన్నుపోటు పొడిచింది శివసేన అని అమిత్ షా గారు పేర్కొన్నారు.
శివసేనను ఎవరు ఏమి అన్నారు, ఎన్నికలకు ముందు ఏర్పడ్డ కూటమిని వదిలేసి, తమ భావజాలాన్ని పక్కకు నెట్టి మరి మూడు పార్టీలు కలిస్తే కొందరు వారికి చప్పట్లు కొడుతున్నారని అన్నారు.

● మేము మా ఎమ్మెల్యేలకు ఎటువంటి ఆంక్షలు విధించలేదు, ఏ హోటళ్లలో బంధించలేదు, ఎవరైతే బంధించారో వారిని ఎందుకు అడగరు అని అమిత్ షా గారు ప్రశ్నించారు.

● పొత్తుకు వెన్నుపోటు పొడిస్తే తప్పు లేదని వాదిస్తారు, కానీ ప్రజల మన్ననలు పొందిన మాపై వేలెత్తి చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

● ఒక వర్గం వాస్తవాలను తారుమారు చేసైనా దీనిని బీజేపీ వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు.

About The Author