సచివాలయ ఉద్యోగులు గా గుర్తించండి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి.


చంద్రగిరి – నవంబరు 27; పంచాయతీ స్వీపర్లు, పంపు ఆపరేటర్లు, బిల్ కలెక్టర్లు, సెక్యూరిటీ గార్డులను సచివాలయ ఉద్యోగులుగ గుర్తించి ప్రభుత్వం జీతాలు చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి పేర్కొన్నారు. సి ఐ టి యు అనుబంధ సంస్థ ఏపీ గ్రామ పంచాయతీ మరియు వర్కర్స్ యూనియన్ జిల్లా 5వ మహాసభ చంద్రగిరి వద్దగల ముక్కోటి ప్రాంగణంలో నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ గ్రామ పంచాయతీ,వర్కర్స్ యునియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సంధర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి మాట్లాడుతూ కార్మికులు చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన వై.యస్.ఆర్.సి.పి. ప్రభుత్వం పంచాయితీ కార్మికుల పట్ల సవితి తల్లి ప్రేమను
చూపిస్తున్నదని ఆరోపించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ గ్రామాలని పేర్లు పెట్టి వాటి ప్రచారానికి వందల కోట్లరూపాయలు ఖర్చుపైడుతున్నారే గాని, పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులకు మాత్రం నెలకు

About The Author