కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…!
ఢిల్లీ: ఇండియాలో విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని ఎయిర్‌పోర్టుల ప్రేవేటీకరణ పూర్తయింది. ఆ దిశగానే మరికొన్ని విమానాశ్రయాలను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారణాశి సహా దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేయాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లక్నో, అహ్మదాబాద్, జయపుర, మంగళూరు, తిరువనంతపురం, గౌహతి విమానాశ్రయాలను నిర్వహణ, అభివృద్ధి, కార్యకలాపాల కోసం పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఇప్పడు కొత్తగా ఆ జాబితాలో మరో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేయాలని ఏఏఐ ప్రతిపాదించింది. అమృత్‌సర్, వారణాశి, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి విమానాశ్రయాలను కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని గత సెప్టెంబరు 5 న జరిగిన బోర్డ్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బోర్డు నిర్ణయాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపించారు. నిజానికి దేశవ్యాప్తంగా ఏఏఐ వందకుపైగా విమానాశ్రయాల నిర్వహణ బాధ్యతలను చూసుకొంటోంది. మొదటి