దారి దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు
నగరంలో పోలీసుల కళ్లుగప్పి దారి దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు, బుధవారం మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపి కృష్ణప్రసాద్ తెలిసిన వివరాల ప్రకారం మెదీపట్నం బోజగుట్ట ప్రాంతానికి చెందిన సురేశ్ , మణిరత్నం మరో ఇద్దరు మైనర్ యువకులతో ముఠాగా ఏర్పడి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో అద్దెకు తీసుకున్న వెరిటో వివాహం లో రాత్రి సమయాల్లో సంచరిస్తూ బస్టాప్ లో నగరానికి వచ్చే ప్రయాణీకులను టార్గెట్ చేస్తూ తమ వాహనంలో తోటి ప్యాసింజర్ లాగా ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశాల్లో వారి వద్ద నుంచి విలువైన వస్తువులను, డబ్బులను, సెల్ఫోన్లను బలవంతంగా బెదిరించి దోచుకుంటున్నారు, చెడు వ్యసనాలకు బానిసలైన ఈ ముఠా సభ్యులు డబ్బులు అవసరమైనప్పుడల్లా ఇలాంటి దారిదోపిడి లకు పాల్పడుతూ నగరంలోని సికింద్రాబాద్ ,ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్, ఉప్పల్ మేడిపల్లి, గచ్చిబౌలి, పటాన్చెరు, మియాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలకు పాల్పడ్డారు, ఎట్టకేలకు మియాపూర్ పోలీసులు చాకచక్యంగా వలపన్ని దారి దోపిడీ ముఠా ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి తొమ్మిది సెల్ఫోన్లు ఒక కారు స్వాధీనం చేసుకున్నారు, ఈ కేసులో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందికి ఏసీపీ కృష్ణ ప్రసాద్ నగదు రివార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో మియాపూర్ ఏసిపి కృష్ణ ప్రసాద్, ఇన్స్పెక్టర్ వెంకటేష్ ,డిఐ మహేష్, డిఎస్ఐ ప్రసాద్ బాబు పలువురు సిబ్బంది పాల్గొన్నారు