వెంకన్నకు ఏడు నెలల్లో రూ.777 కోట్లు…


తిరుమల వెంకన్న హుండీ ఆదాయం ఏటేటా పెరుగుతోంది. గడిచిన ఏడు నెలల్లో  రూ.777.78 కోట్ల కానుకలు అందాయి. 2018లో ఏడునెలల కాలంలో రూ. 707.95 కోట్లు లభిస్తే, ఈసారి  రూ.69.82 కోట్లు ఎక్కువగా హుండీ ఆదాయం పెరిగింది.  ఈ ఏడాది 7 నెలల కాలంలో  803 కిలోల  బంగారాన్ని కానుకగా భక్తులు సమర్పించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 241 కిలోల బంగారం అధికంగా వచ్చింది. ఇక వెండి కూడా ఈసారి  3,852 కిలోలు లభించగా, గత ఏడాది 1,859 కిలోలతో పోల్చితే1993 కిలోలు అధికంగా వచ్చింది. ఒక్క నవంబర్ నెలలోనే 21.16 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది.

About The Author