భైరవగీత
అనగనగా రాయలసీమ.. అక్కడ రెడ్ల రాజ్యం..
అందులో ఓ బానిస.. ఆ బానిసను ప్రేమించి పారిపోయే రెడ్డి కూతురు..
బానిస జాడ కోసం స్నేహితుల్ని.. ఫ్యామిలీని చంపే విలన్..
15 ఏళ్ల కింద వచ్చిన గోపీచంద్ యజ్ఞం సినిమా కథ కాదిది.. ఇప్పుడు విడుదలైన భైరవగీత కథ..
కాలం కరిగేకొద్ది వచ్చిన హిట్ సినిమా కథలను ప్రేక్షకులు మరిచిపోతారేమో అనుకుంటారు దర్శకులు..
అలా అనుకుని యజ్ఞంను మోడ్రనైజ్ చేసి భైరవగీత తీసాడు సిద్దార్థ్ తాతోలు..
అంతేలె యజ్ఞం విడుదలైనపుడు సిద్ధార్థ్ వయసు 8 ఏళ్లే..
23 ఏళ్లకే రక్తపాతం ఏరులై పారే భైరవగీత సినిమా తెరకెక్కించాడు ఈ దర్శకుడు..
కాకపోతే వర్మ శిష్యుడు కదా.. ముద్దులు, రక్తపాతం అడీషనల్ గా యాడ్ చేసాడు..
మిగిలిందంతా సేమ్ టూ సేమ్.. సినిమా అంతా హద్దులు దాటిన రక్తపాతం అబ్బో అనిపిస్తుంది..
ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అయితే రొమాన్స్.. లేకపోతే వయోలెన్స్.. ఇదే బాటలో నడిచింది భైరవగీత..
ఇందులో వర్మ చేయి పడిందో లేదో తెలియదు కానీ ఆయన ఛాయలు మాత్రం అడుగడుగునా కనిపించాయి..
హీరో ధనంజయ్ బాగానే నటించాడు.. ఎదురుతిరిగిన బానిసగా పర్లేదనిపించాడు..
హీరోయిన్ ఇర్రా మోర్ జూనియర్ శ్రీయలా ఉంది.. నటన కంటే అందమే ఎక్కువగా ఫోకస్ అయింది..
ఓవరాల్ గా భైరవగీత.. రక్తసిక్త రాయలసీమ రక్తపాత గీత..